Begin typing your search above and press return to search.

వీడియో : బిగ్‌ బాస్ బ్యూటీ మతి పోగొడుతోంది

By:  Tupaki Desk   |   31 Dec 2022 9:30 AM GMT
వీడియో : బిగ్‌ బాస్ బ్యూటీ మతి పోగొడుతోంది
X
సోషల్‌ మీడియా ద్వారా మొదట జూనియర్ సమంత అంటూ పేరు దక్కించుకుని ఆ తర్వాత బుల్లి తెర ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి. ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అషు రెడ్డి బిగ్ బాస్ తో స్టార్ గా ఇమేజ్ ను దక్కించుకుంది.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అషు రెడ్డికి హీరోయిన్స్ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇన్‌ స్టాగ్రామ్‌లో దాదాపుగా రెండు మిలియన్ ల ఫాలోవర్స్ ఈ అమ్మడి సొంతం. ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నందుకు గాను ఈ అమ్మడు హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా తన హాట్‌ ఫొటోలను షేర్ చేస్తూ ఉంది.

హీరోయిన్‌ గా ఈ అమ్మడు సినిమాలు పెద్దగా చేయకున్నా కూడా ఆ స్థాయిలో ఫాలోయింగ్‌ ను పాపులారిటీని దక్కించుకునేందుకు కారణం ఈమె షేర్ చేసే అందాల ఫొటో షూట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మధ్య వర్మ ఇంటర్వ్యూ తో వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు తాజాగా ఈ వీడియోను షేర్ చేసి తన అందంతో వార్తల్లో నిలిచింది.

ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట్‌ కోసం అంటూ ఈ వీడియోను షేర్ చేసింది. బాలీవుడ్ ముద్దుగుమ్మల రేంజ్ లో ఈ అమ్మడి అందం ఉంటుంది కనుకే ఈమె కాళ్ల వద్ద వర్మ కూర్చుని ఆమె కాళి వేలును నోట్లు పెట్టుకున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ అమ్మడు తెలుగు లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకోలేక పోతుంది. కానీ ఇతర భాషల్లో ప్రయత్నిస్తే కచ్చితంగా మంచి ఆఫర్స్‌ వచ్చే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.