Begin typing your search above and press return to search.

వీడియో చేసి వాళ్లని మరింత రెచ్చగొట్టిన అషు రెడ్డి..!

By:  Tupaki Desk   |   12 Nov 2022 2:30 PM GMT
వీడియో చేసి వాళ్లని మరింత రెచ్చగొట్టిన అషు రెడ్డి..!
X
సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన కామెంట్స్ అనేవి సర్వ సాధారణం వాటిని చాలా వరకు లైట్ తీసుకుంటేనే బెటర్ లేదంటే అనవసరమైన తలనొప్పులు వస్తాయి. సెలబ్రిటీస్ విషయంలో చాలా వరకు నెటిజెన్లు చేస్తున్న కామెంట్స్ కి స్పందించకపోయినా కొన్నిటికి స్పందించాల్సి వస్తుంది. అలా రెస్పాన్స్ ఇస్తే.. దానిపై మరింత రెచ్చిపోతారు నెటిజెన్లు. ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కౌంట్ చూసి మురిసిపోయేలా ఉన్న తేడా వస్తే అక్కడ వారు చేసే కామెంట్స్ కి సమాధానం చెప్పుకోలేక తల ప్రాణం తోకకి వస్తుంది. అయితే ఎవరేం అనుకున్నా మనం చేసేది చేసుకుంటూ వెళ్లిపోవడమే అనేది కొందరు ఆలోచన.

అసలు ఇంతకీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి బీభత్సంగా సోషల్ మీడియాని వాడేస్తుంది. తన హాట్ ఫోటో షూట్స్ తో అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇన్ స్టా ఫోటోస్, రీల్స్ తో ఫాలోవర్స్ కి మంచి ఐ ఫీస్ట్ అందిస్తుంది అషు.

అందాల ప్రదర్శనలో లిమిట్స్ అనేదే లేదు అనేలా అషు రెడ్డి రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా అషు రెడ్డి పెట్టిన కొన్ని ఫోటోలు, రీల్స్ మరింత హాట్ షో కనబరిచినట్టు అనిపించాయి. అయితే వీటికి నెటిజెన్ల నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అషు ఫోటోస్, వీడియోస్ కింద కామెంట్స్ ని ఘోరమైన బూతులు పెడుతున్నారు.

వారికి పంచ్ వేసేలా అషు రెడ్డి ఒక రీల్ చేసింది. కామా తురాణాం న: భయం.. న: లజ్జ.. అనే డైలాగ్ ని పెట్టింది. ఇది అందరికి కాదు తనకు చెడు కామెంట్స్ పెట్టేవారికి అంటూ అషు చెప్పింది. అయితే ఈ వీడియోపై మరింత కామెంట్స్ వస్తున్నాయి. అషు చేస్తున్న స్కిన్ షోకి.. నెటిజెన్లు పెడుతున్న కామెంట్స్ ఎవరు ఎక్కడా తగ్గేదేలేదు అన్నట్టు పరిస్థితి కబడుతుంది. బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో యాంకర్ గా కొన్నాళ్లు కొనసాగించిన అషు ప్రస్తుతం లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడు చూసినా ఫారిన్ వెళ్తున్న అమ్మడి మీద రకరకాల కామెంట్స్ తో ఎటాక్ చేస్తున్నారు.

అలాంటి వారికోసమే అషు ఆ వీడియో పెట్టింది. జూనియర్ సమంతగా క్రేజ్ తెచ్చుకున్న సమంత ఒరిజినల్ సమంతని మించి రెచ్చిపోతుంది. అషు ఈ స్కిన్ షో కేవలం తన కిక్ కోసమే చేస్తున్నట్టు అనిపిస్తున్నా ఫాలోవర్స్ మాత్రం ఆమె పై నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఎవరు ఏమనుకున్నా సరే తను చేసేది మాత్రం చేస్తానంటూ అషు చెప్పుకొచ్చింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.