Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ హౌస్‌: ఈ వారం అవుట్ ఎవ‌రంటే..

By:  Tupaki Desk   |   22 Aug 2019 6:52 AM GMT
బిగ్‌ బాస్ హౌస్‌: ఈ వారం అవుట్ ఎవ‌రంటే..
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్ 4 నాలుగు వారాలు పూర్తి చేసుకుని విజ‌య‌వంతంగా నాలుగో వారంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్ప‌టికే హౌస్ నుంచి న‌లుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ముందు హౌస్‌ లోకి వ‌చ్చిన హేమ‌ - జాఫ‌ర్‌ - రోహిణితో పాటు వైల్డ్‌ కార్డ్ ఎంట్రీ ద్వారా వ‌చ్చిన ట్రాన్స్‌ జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి సైతం ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం హౌస్ ఐదో వారం ర‌న్ అవుతోంది.

ప్ర‌స్తుతం హౌస్‌ లో 12 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ అయిదవ వారంలో ఎలిమినేషన్స్‌ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో సింగ‌ర్ రాహుల్ సిఫ్లిగంజ్‌ - పునర్నవి - బాబా భాస్కర్‌ - మహేష్‌ విట్టా - హిమజ - అషు - శివజ్యోతి ఎలిమినేష‌న్‌ లో ఉన్నారు. మ‌రి వీరిలో ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారు అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. హౌస్‌ లో న‌డుస్తోన్న ట్రెండ్‌ తో పాటు సోష‌ల్ మీడియా ట్రెండ్స్‌ ను బ‌ట్టి చూస్తే ఈ ఏడుగురిలో రాహుల్‌ మరియు అషు రెడ్డిలు వీక్‌ కంటెస్టెంట్స్‌ గా అనిపిస్తున్నారు.

రాహుల్‌ కు హౌస్‌ లో సీరియ‌స్ నెస్ లేదు. టాస్క్‌ ల విష‌యంలో చాలా సిల్లీగా ఉంటున్నాడు. ఓ ప్రొఫెష‌న‌ల్ సింగ‌ర్ అయ్యి ఉండి కూడా ఓ పాట పాడేందుకు నానా ఇబ్బంది ప‌డ్డాడు. హౌస్‌ మేట్స్ కూడా ఎక్కువ మంది ఈ వారం రాహుల్‌ నే నామినేట్ చేశారు. ఎక్కువ మంది రాహుల్‌ పైనే కంప్లెంట్స్ చేస్తున్నారు.

ఇక రెండు - మూడు స్థానాల్లో హిమ‌జ‌ - అషురెడ్డి ఉన్నారు. లోప‌ల ఎక్కువ మంది రాహుల్‌ ను టార్గెట్ చేయ‌డంతో అత‌డిపై బ‌య‌ట జ‌నాల్లో ఓ పాజిటివ్ సిగ్న‌ల్స్ ఏర్ప‌డ్డాయి. గ‌త వారం కూడా ఇదే జ‌రిగింది. బ‌య‌ట సింగర్ కావ‌డంతో పాటు హౌస్ లోనూ ఎక్క‌డా కావాల‌ని కృత్రిమంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు అనిపించ‌క‌పోవ‌డంతో బ‌య‌ట జ‌నాలు రాహుల్ ప‌ట్ల సానుకూలంగా ఉన్న సంకేతాలే క‌నిపిస్తున్నాయి.

ఇక అన్షు టాస్క్‌ ల్లో సీరియ‌స్‌ గా ఉన్న‌ట్టు అనిపించ‌డం లేదు. ఇక ఆమెకు స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువుగా లేదు. ఏదో హౌస్‌ లో ఉన్నాం అంటే ఉన్న‌ట్టుగా ఆమె వ్య‌వ‌హారం క‌నిపిస్తోంది. దీంతో ఆమెకు ఓట్లేసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూప‌డం లేద‌ని తెలుస్తోంది. ఇదే ట్రెండ్ ఈ వీకెండ్ వ‌ర‌కు కంటిన్యూ అయితే ఈ వారం హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లేది అన్షు రెడ్డే అవుతుంద‌న‌డంలో డౌట్ లేదు.