Begin typing your search above and press return to search.
ఏడెనిమిదేళ్లలో ఊపిరి లాంటి సినిమా రాలేదట
By: Tupaki Desk | 4 April 2016 1:30 PM GMT‘ఊపిరి’ మీద ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది. సినీ..రాజకీయ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఇప్పటికే ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించారు. ఇటీవలే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సైతం ఈ సినిమా చూసి ఫ్లాటైపోయాడు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ సినిమాను పొగిడారు. ట్విట్టర్లోనూ ప్రశంసలు కురిపించారు. తాజాగా టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్లలో ఒకరైన అశ్వనీదత్ ‘ఊపిరి’ సినిమా చూసి ముగ్ధుడైపోయారు. గత ఏడెనిమిదేళ్లలో ఇలాంటి సినిమా తాను చూడలేదంటూ ఆయన ‘ఊపిరి’ని ఆకాశానికెత్తేశారు. ‘ఊపిరి’పై ప్రశంసలు కురిపిస్తూ ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
‘‘గత ఏడెనిమిదేళ్లలో నేను ఇంత గొప్ప సినిమా చూడలేదు. ఒక విభిన్నమైన కథాంశంతో ఎంతో లావిష్ గా.. అద్భుతంగా ఈ సినిమా తీసిన పీవీపీ గారికి హ్యాట్సాఫ్. నా తరం నిర్మాతలందరూ గర్వపడే చిత్రం ఊపిరి. ‘గీతాంజలి’ తర్వాత నాగార్జున ఎంతో గొప్పగా నటించిన సినిమా ఇదే. నాగార్జున అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ కి తోడు.. కార్తి కూడా చాలా బ్యాలెన్స్‌డ్ గా నటించాడు. ఇంతకుముందు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన సినిమాలు చూసి మామూలు దర్శకుడు అనుకున్నాను. కానీ ‘ఊపిరి’ చూసిన తర్వాత నా అభిప్రాయం మారింది. వంశీ ఒక గొప్ప దర్శకుడని ఫీలయ్యాను. ‘ఊపిరి’ చిత్రాన్ని వంశీ మలచిన తీరు అద్భుతం. ఈ సినిమా అఖండమైన విజయాన్ని సాధించినందుకు సాటి నిర్మాతగా నేనెంతో ఆనందిస్తున్నాను. 'ఊపిరి'లాంటి మంచి సినిమాలో భాగమైన యూనిట్ మొత్తానికి నా అభినందనలు’’ అన్నారు అశ్వనీదత్.