Begin typing your search above and press return to search.
మెగాస్టార్ 152 వైజయంతిలో లేదు!
By: Tupaki Desk | 12 Oct 2018 11:19 AM GMTప్రఖ్యాత వైజయంతి మూవీస్ సంస్థ మహానటి - దేవదాస్ చిత్రాలతో వరుస విజయాలు అందుకుని ట్రాక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మహానటి బాక్సాఫీస్ వద్ద దాదాపు 80 కోట్లు వసూలు చేయగా - దేవదాస్ 50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. ఆ క్రమంలోనే ఈ విజయాల్ని పురస్కరించుకుని దత్ వరుసగా భారీ సినిమాలకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదివరకూ ఎన్టీఆర్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వ ంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నామని అశ్వనిదత్ స్వయంగా ప్రకటించారు. దేవదాస్ ప్రచార కార్యక్రమాల్లో భవిష్యత్ ప్రాజెక్టుల వివరాల్ని తెలిపారు. యువహీరో విజయ్ దేవరకొండతోనూ ప్రాజెక్టు ఉంటుందని తెలిపారు. అయితే మెగాస్టార్ చిరంజీవి- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లను కలిపి టీఎస్సార్ తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ నిర్మిస్తారని ఇదివరకూ వార్తలొచ్చాయి. అయితే పవన్ పాలిటిక్స్ లో బిజీ. చిరు సైరాతో బిజీ కాబట్టి అది ఇప్పట్లో లేనట్టేనని అనుకున్నారంతా. అయితే మెగాస్టార్ సైరా చిత్రాన్ని ముగించుకున్న అనంతరం వైజయంతి బ్యానర్ లో ఓ చిత్రం చేస్తారన్న ఊహాగానాలు ప్రచారం అయ్యాయి. అయితే దీనికి వైజయంతి సంస్థ స్పందించింది. మెగాస్టార్ 152వ చిత్రం మేం చేయడం లేదని వైజయంతి మూవీస్ సామాజిక మాధ్యమాల వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ట్వీట్ చేసింది. వైజయంతి బ్యానర్ లో చిరంజీవి కాంబినేషన్ లో నాలుగు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఐదో సినిమా తీసేలా ఉంటే మేమే గర్వంగా ప్రకటిస్తామని ట్విట్టర్ లో వెల్లడించింది.
మెగాస్టార్ చిరంజీవి - వైజయంతి బ్యానర్ అనగానే `జగదేక వీరుడు అతిలోక సుందరి` - `చూడాలని ఉంది` - `ఇంద్ర` - `జై చిరంజీవ` లాంటి బ్లాక్ బస్టర్లు గుర్తుకొస్తాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి సంచలనాలు గుర్తుకొస్తాయి. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్ పై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం వైజయంతి సంస్థ మహేశ్ కథానాయకుడిగా `మహర్షి` చిత్రాన్ని నిర్మిస్తోంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.