Begin typing your search above and press return to search.
మహేష్ తో దత్.. ఇక నిర్మాతే!!
By: Tupaki Desk | 22 May 2018 5:03 AM GMTమహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని అశ్వినీదత్ చాలా కాలంగా భావిస్తున్నారు. నిజానికి మహేష్ హీరోగా రూపొందిన తొలిమూవీ రాజకుమారుడు నిర్మాత ఆయనే. అశ్వినీ దత్ దగ్గర మహేష్ డేట్స్ ఉన్నా.. సినిమా నిర్మాణాన్ని మాత్రం దిల్ రాజు బ్యానర్ పైనే లాంఛ్ చేయించారు.
గత కొన్నేళ్లుగా వైజయంతి మూవీస్ బ్యానర్ బ్యాడ్ టైం ఎదుర్కొనడమే ఇందుకు కారణం. బిజినెస్ వ్యవహారాల వంటి వాటికి క్రేజ్ ఉండదనే ఉద్దేశ్యంతో.. మహేష్ తో సినిమాను తాను సమర్పకుడిగా ఉంటూ.. దిల్ రాజు నిర్మాణంలో రూపొందించేలా ప్రారంభించారు. కానీ ఇదంతా కొన్ని రోజుల క్రితం వ్యవహారం. ఎప్పుడైతే మహానటి థియేటర్లలోకి వచ్చిందో.. ఆ సినిమా స్టాండర్డ్స్ చూసి.. వైజయంతి బ్యానర్ సత్తా ఏంటో మరోసారి నిరూపితం అయింది. ఇప్పుడు మహేష్ తో మూవీ విషయంలో దత్తుగారి ఆలోచనలు మారుతున్నాయట. మొదట ఏదో పేరుకు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారంతే. కానీ ఇప్పుడు సగం పెట్టుబడి తానే పెట్టాలని ఫిక్స్ అయిపోయారట.
అలాగని తానే మొత్తం నిర్మించేయాలని అనుకోవడం లేదు కానీ.. మహేష్ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాలని అనుకుంటున్నారట అశ్వినీదత్. ప్రొడక్షన్ లో వాటా పెంచుకోవడంపై విషయంపై ఇప్పటికే దిల్ రాజు.. మహేష్ బాబులకు కూడా సమాచారం పంపారట. అయితే దీనికి దిల్ రాజు ఎంతమేరకు అంగీకరిస్తారనే సంగతి తెలియాల్సి ఉంది. దీనిపై మహేష్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి మహానటి చిత్రం అశ్వినీదత్ ను మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చిందనే మాట అయితే మాత్రం వాస్తవం.