Begin typing your search above and press return to search.
అందరూ సేఫ్ అవ్వాలి అప్పుడే డ్రెస్ చేంజ్ !
By: Tupaki Desk | 21 Oct 2019 1:59 PM GMTమన దర్శకుల్లో ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో వెళ్తుంటారు. అయితే యాంకర్ నుండి దర్శకుడిగా మారిన ఓంకార్ కూడా ఓ పంథాలో వెళ్తున్నాడు. తనకి దర్శకుడిగా పేరుతెచ్చిన 'రాజు గారి గది' సినిమాకు ఇతర భాషల్లో వచ్చిన సినిమాలతో సీక్వెల్స్ చేస్తూ వస్తున్నాడు. అయితే రాజు గారి గది 2 ఫ్లాప్ అవ్వడంతో తమ్ముడిని హీరోగా పెట్టి రాజు గారి గారి 3 చేసాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది.
అడల్ట్ కామెడీ తప్ప సినిమాలో మేటర్ లేదని అటు క్రిటిక్స్ తో పాటు ఇటు ప్రేక్షకులు కూడా తేల్చేశారు. అయితే తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో హీరో అశ్విన్ సినిమా మీద వచ్చిన బ్యాడ్ టాక్ గురించి భాద పడుతూ స్పీచ్ ఇచ్చాడు. ఒక సినిమా రిజల్ట్ ను బుక్ మై షో డిసైడ్ చేయడం ఏమిటి క్రిటిక్స్ ఒపీనియన్ మాత్రమే తీసుకొని పర్సెంటేజ్ ఇచ్చారు అంటూ ఆ యాప్ పై విరుచుకుపడ్డాడు.
కట్ చేస్తే తమ్ముడి భాదను చూసి తమ సినిమా ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లో ఉందని ధైర్యం చెప్తూ వచ్చాడు ఓంకార్. తను ఎన్నో దెబ్బలు తిన్నానని ఇక సినిమా విషయంలో రివ్యూలు పట్టించుకోనని, కానీ అశ్విన్ కి ఇది మొదటి దెబ్బ కావడంతో ఇలా భాద పడుతున్నాడని అన్నాడు. ఇక తన తమ్ముడిని హీరోగా నిలబెట్టేశానని అందరూ అశ్విన్ నటనను మెచ్చుకొని బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పాడు. ఇక తమ డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబ్యూటర్స్ సేఫ్ అయ్యే వరకూ తెల్లని దుస్తులను తీయనని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే మంచి కలెక్షన్స్ రాబట్టమని - దీపావళి లోపు సినిమా లాభల్లోకి వెళ్తుందనే నమ్మకం కూడా వ్యక్తం చేశాడు. ఇదంతా బాగానే ఉంది కానీ భ్రమరాంబలో ఒక అరవై దాటిన వృద్ధురాలు సినిమా చూసి నవ్వుతూ నవ్వుతూ సీటు లో నుండి పడిపోయందంటూ ఆడియన్స్ రెస్పాన్స్ గురించి చెప్తూ ఓంకార్ చెప్పిన ఈ ఉదాహరణ మాత్రం అందరినీ నువ్వెలా చేసింది.