Begin typing your search above and press return to search.

ఇన్నాళ్ళకు డీల్ సెట్టయ్యిందా రెడ్డి?

By:  Tupaki Desk   |   25 July 2017 1:27 PM GMT
ఇన్నాళ్ళకు డీల్ సెట్టయ్యిందా రెడ్డి?
X
ఇప్పుడు ఏదన్నా సినిమాకు సంబంధించిన బిజినెస్ పిక్ అవ్వాలంటే మాత్రం.. ఆ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ నుండి టీజర్ వరకు చాలా ఇంప్రెసివ్ గా ఉండాలి. అలా ఉంటేనే సినిమాలో ధమ్ ఉందని జనాలు నమ్మేసి సినిమాను వివిధ ఏరియాల్లో కొనుక్కోవడానికి ముందుకొస్తారు. అదిగో పెళ్ళి చూపులు ఫేం విజయ్ దేవరకొండ కొత్త సినిమా ''అర్జున్ రెడ్డి'' విషయంలో ఇప్పుడు అదే జరిగిందట.

టీజర్ వచ్చిన చాలా రోజుల తరువాత ఇప్పుడు ఈ సినిమాను ఏసియన్ ఫిలింస్ వారు 5.5 కోట్లకు కొనుక్కున్నారట. మొత్తంగా తెలుగు రాష్ట్రాల హక్కులను ఈ బడ్జెట్ తో కొనేశారని అంటున్నారు. బాగానే ఉంది కాని.. ఆ సినిమా టీజర్లో కేవలం హీరో ధైర్యంగా బూతులు తిట్టడం తప్పించి.. అసలు ఏముందని ఇంత పెట్టేశారు అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే సెన్సార్ బోర్డు వారు ధియేటర్లలో ఇలాంటి బూతులను చూపించడానికి అస్సలు ఒప్పుకోరుగా. అలాంటప్పుడు మనోళ్ళు ఏం చూసి సినిమాపై ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు అనేదే సందేహం అయితే సినిమాలో యాంగర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ ను డీల్ చేసిన విధానం బాగుందని అందుకే సినిమాను గంపగుత్తగా కొనేశారని టాక్ కూడా వినిపిస్తోంది.

కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి రూపొందిస్తున్న ఈ అర్జున్ రెడ్డి సినిమా అసలు డిలే అవ్వడానికి.. స్టోరీ అండ్ సీన్స్ విషయంలో విజయ్ దేవరకొండ అడిగిన మార్పులను డైరక్టర్ చేయకపోవడం వలనేనట. పెళ్ళిచూపులు సినిమా విషయంలోనే ఎన్నో సీన్లను మార్చేసి.. ఆ తరువాత తన తండ్రి ఇన్వాల్వ్ అవ్వడంతో స్ర్కిప్టులో వేలుపెట్టకుండా సైలెంట్ అయిపోయిన విజయ్.. ఇప్పుడు తనలోని దర్శకుడికి ఓవర్ గా పనిచెప్పడం వలనే క్లాష్ వస్తోందట. అది సంగతి.