Begin typing your search above and press return to search.
నందమూరి బయోపిక్ నైజాం రిలీజ్ ఆయనే
By: Tupaki Desk | 26 Sep 2018 6:09 AM GMTనందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా కు దసరా సీజన్ లోపే ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తయ్యేలా ఉంది. ఇప్పటికే ఈ 'ఎన్టీఆర్' ఉత్తరాంధ్ర - కృష్ణ జిల్లా - కర్ణాటక ఏరియా హక్కులను సాయి కొర్రపాటి తీసుకున్నారు. అయన ఎన్టీఆర్ నిర్మాతలలో ఒకరన్న విషయం తెలిసిందే.
ఇక తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ ను నైజాం ఏరియాలో ఏషియన్ సినిమాస్ సునీల్ రిలీజ్ చేస్తారట. ఈ డీల్ ఎంతకు క్లోజ్ అయింది.. సునీల్ నైజాం థియేట్రికల్ రైట్స్ కొన్నారా లేదా రిలీజ్ మాత్రమే చేస్తున్నారా అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. నైజాం విషయం ఇలా ఉంటే సీడెడ్.. ఆంధ్రాలోని మిగతా ఏరియాల థియేట్రికల్ రైట్స్ తీసుకునేందుకు పలువురు బయ్యర్స్ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారట. త్వరలో ఆ వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు 'ఎన్టీఆర్' పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతూ ఉంది. రెండు మూడు రోజులకోసారి ఒక కొత్త అప్డేట్ తో ఫిలిం యూనిట్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగేశ్వరరావు.. నారా చంద్రబాబు నాయుడు పాత్రల ఫస్ట్ లుక్ తో అందరిని ఆకట్టుకున్న 'ఎన్టీఆర్' టీమ్ రానున్న రోజుల్లో కృష్ణ.. చిరంజీవి.. లాంటి స్టార్ ల లుక్స్ రిలీజ్ చేస్తే మరింత క్రేజ్ పెరగడం ఖాయం