Begin typing your search above and press return to search.
ఏషియన్ ఫిలింస్ డీల్ ఎంత?
By: Tupaki Desk | 26 May 2019 4:22 AM GMT`టైగర్ జిందా హై` తర్వాత మళ్లీ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలోనే నటిస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అందుకే సల్మాన్- కత్రిన జోడీని రిపీట్ చేస్తూ అలీ అబ్బాస్ జాఫర్ భారత్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం బాలీవుడ్ ట్రేడ్ సహా అన్నిచోట్లా హాట్ టాపిక్ గా మారింది. టైగర్ జిందా హై సల్మాన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించడమే గాక బాక్సాఫీస్ వద్ద ఏకంగా 600కోట్లు వసూలు చేసింది. మరోసారి సేమ్ విక్టరీ అందుకోవాలన్న పంతంతో భారత్ చిత్రానికి ఈ కాంబినేషన్ కమిటైంది. ఏడాది కాలంగా ఈ సినిమా షూటింగ్ లో సల్మాన్ భాయ్ బిజీ బిజీగా ఉన్నాడు. ఎట్టకేలకు చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. జూన్ 5న సినిమా రిలీజవుతోంది.
ఈ శుభసందర్భంలో సల్మాన్ - కత్రిన- జాఫర్ బృందం రెగ్యులర్ బేసిస్ లో భారత్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా ఏపీ- తెలంగాణ రైట్స్ ని ఏషియన్ సినిమాస్ చేజిక్కించుకుందని తెలుస్తోంది. ఈ డీల్ విలువ రూ.4-5 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. సల్మాన్ సినిమాకి ఓన్లీ మల్టీప్లెక్స్ వసూళ్లపైనే అంచనా ఉందన్నది ఓ విశ్లేషణ. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్ యాక్షన్ ఓ రేంజులో ఉండబోతోందని తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాలో సల్మాన్ ఓవైపు సర్కస్ వాలాగా.. దేశ భక్తుడైన నేవీ అధికారికగా రకరకాల షేడ్స్ లో కనిపించనున్నాడు. అలాగే ఇందులో లోఫర్ బ్యూటీ దిశా పటానీ గ్లామరస్ యాంగిల్ యూత్ కి పిచ్చెక్కించడం గ్యారెంటీ అని ట్రైలర్ చెబుతోంది. అందాల కత్రిన ఒక కొత్త లుక్ లో బోయ్స్ కి ఇప్పటికే చెమటలు పట్టిస్తోంది. ఈ ఎలిమెంట్స్ అన్నీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతాయని అంచనా వేస్తున్నారు.
ఇక సల్మాన్ భాయ్ సినిమా తెలుగులో రిలీజవుతోంది అంటే కచ్ఛితంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బరిలో దిగుతారనడంలో సందేహమేం లేదు. ప్రచారం పరంగా సల్మాన్ స్నేహితుడు చరణ్ సాయానికొస్తారనే అభిమానులు అంచనా వేస్తున్నారు. `భారత్` తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తారా.. లేదా? అన్నది ఏషియన్ సినిమాస్ సంస్థ స్వయంగా ప్రకటించాల్సి ఉంది. పలువురు నిర్మాణ భాగస్వాములతో కలిసి సల్మాన్ ఖాన్ ఫిలింస్ - టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.