Begin typing your search above and press return to search.

అసిన్ పెళ్లి.. రెండుసార్లయింది

By:  Tupaki Desk   |   19 Jan 2016 1:29 PM GMT
అసిన్ పెళ్లి.. రెండుసార్లయింది
X
తోటి హీరోయిన్లందరూ తనను చూసి కుళ్లుకునేలా ఇవాళ పెళ్లి చేసుకుంది మలయాళ కుట్టి అసిల్ తొట్టుంకల్. మైక్రోమాక్స్ కో ఫౌండర్ రాహుల్ శర్మను లవ్ లో పడేసి అతడిని పెళ్లివైపు నడిపించిన అసిన్.. ఈ రోజే అతడి సొంతమైంది. ఒకే రోజు రెండుసార్లు వీళ్లిద్దరి పెళ్లి జరగడం విశేషం. ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వాళ్లు కావడమే దీనికి కారణం. క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అసిన్ కోసం ముందు వారి సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు రాహుల్.

ఉదయం ఢిల్లీలోని మేక్ షిఫ్ట్ చర్చిలో అసిన్, రాహుల్ ల పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగింది. తెల్లటి గౌనులో అసిన్ మెరిసిపోగా రాహుల్ నల్లటి సూట్ ధరించాడు. ఈ వేడుకకు కేవలం 50 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత మధ్యాహ్నం 200 మంది అతిథుల మధ్య రాహుల్ కుటుంబం కోసం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. బుధవారం రాహుల్ శర్మ ఫార్మ్ హౌస్ లో విందు ఏర్పాటు చేశారు. అనంతరం ఈ నెల 23న ముంబయిలో బాలీవుడ్, బిజినెస్ సెలబ్రెటీస్ కోసం రిసెప్షన్ ఉంటుంది.