Begin typing your search above and press return to search.
మైక్రోమ్యాక్స్ ఓనర్ తో అసిన్ పెళ్ళి
By: Tupaki Desk | 10 Aug 2015 4:17 AM GMTఇన్నాళ్ళూ ఎవరినో డేటింగ్ చేస్తున్నావ్ కదా అంటూ మీడియా ప్రశ్నల వర్షం కురిపించినా కూడా అమ్మడు మాత్రం ఒక్కమాటైనా మాట్లాడితే ఒట్టు. నేనా డేటింగా? అంటూ కలరింగ్ ఇచ్చేది. ఎవరో ఒక బిలియనీర్ మీ వలలో పడ్డారట అని అడిగితే.. ఏయ్ మిస్టర్ మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటూ కౌంటర్స్ ఇచ్చింది అమ్మడు. కాని కట్ చేస్తే ఇన్నాళ్ళూ అందరికీ తెలిసిన గాసిప్పే నిజమైంది. ఎట్టకేలకు అసిన్ కూడా ఒప్పుకుంది.
తొలి ఇండియన్ బ్రాండ్ మొబైల్ కంపెనీ.. మైక్రోమ్యాక్స్.. దాని ఓనర్ రాహుల్ శర్మ. ఈ ప్రఖ్యాత 36 ఏళ్ళ బిలియనీర్ ఇప్పుడు అసిన్ ను పెళ్ళాడబోతున్నాడు. మనోడు గత రెండేళ్ళగా ఆసిన్ ప్రేమలో ఉన్నాడట. అసిన్ కూడా ఇతగాడి తో ప్రపంచమంతా చుట్టేస్తోంది. కాకపోతే ముంబయ్ లో మాత్రం ఎవ్వరకీ కనిపించకుండా జగ్రత్తపడ్డారు. అందుకే మీడియా వీరి విషయాన్ని కనిపెట్టడానికి బాగా టైమ్ పట్టేసింది. ఇకపోతే ప్రస్తుతం అసిన్ చేతిలో ఉన్న సినిమా ''ఆల్ ఈజ్ వెల్'' ఒక్కటే. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ అమ్మడికి బాలీవుడ్ లో అవకాశాలు ఖాళీ అయిపోయాయిలే. అందుకే ఇప్పుడు పెళ్ళి బాట పడుతోంది అనే వాదన కూడా వినిపిస్తోంది.
ఏదేమైనా గత 10-12 సంవత్సరాలుగా హీరోయిన్ గా అలరించిన ఈ మల్లూ బ్యూటి ఎట్టకేలకు పెళ్ళి చేసుకుంటుందంటే అది ఆనందించదగిన పరిణామమే. తక్కిన బాలీవుడ్ హీరోయిన్ల టైపులో లవ్-బ్రేకప్-జిందగీ అనకుండా చక్కగా పెళ్ళిచేసుకొని సెటిల్ అయిపోమ్మా అసిన్.. నువ్వు తిరిగి సినిమాల్లోకి వచ్చినా.. మళ్ళీ ఎంటర్ టైన్ చేయడానికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు.. కాని ఫ్యామిలీ ఎప్పుడూ నీతోనే ఉంటుంది.