Begin typing your search above and press return to search.
హీరో మారాడు, కానీ పాట మారలేదు
By: Tupaki Desk | 9 July 2015 1:30 PM GMTఒక్కోసారి ఎంతో ఇష్టపడి నటించిన సీన్లు, పాటలు .. తీరా తెరపై చూసుకున్నప్పుడు కనిపించవు. ఓవర్ లెంగ్త్ వల్ల ఎడిటింగ్‌లో కటింగ్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు అందులో నటించిన తారల మనసు నొచ్చుకోవడం సహజం. అరే పేరొస్తుందనుకున్న సీన్ కట్ చేసేశారే అని బాధపడే నటీనటులు ఎందరో. సరిగ్గా అలాంటి సన్నివేశాన్నే ఎదుర్కొంది అందాల అసిన్.
ఈ భామ అక్షయ్‌కుమార్ సరసన కిలాడి 786 చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. 'బాతోంకో తేరీ .. అంటూ ఓ అద్భుతమైన మెలోడీని హిమేష్ రేషమియా కంపోజింగ్‌లో తెరకెక్కించారు. ఇందులో అసిన్‌పై వచ్చే మాంటేజ్ షాట్స్ అద్భుతంగా కుదిరాయి. ట్యూన్ సహా విజువల్స్ ఎంతో ఆకట్టుకునేలా వచ్చినా తీరా ఎడిటింగ్‌లో అదంతా కట్ చేయాల్సొచ్చింది. ఆ సందర్భంలో అసిన్ ఎంతో బాధపడింది.
కట్ చేస్తే మరో సర్ప్రైజ్. అసిన్ ప్రస్తుతం ఉమేష్ శుక్లా దర్శకత్వంలో 'ఆల్ ఈజ్ వెల్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఓ పాటని, అందులోని మాంటేజెస్ని తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. 'బాతోంకో తేరీ' అంటూ సాగే పాట అది. ఆ ట్యూన్ వినగానే అశిన్ రెట్టించిన ఉత్సాహంతో కెమెరా ముందుకు వచ్చింది. అరే ఆ పాటనే ఇప్పుడు మళ్లీ షూట్ చేస్తున్నారా? నాకు ఎంతో ఇష్టమైనది అంటూ సంబర పడిపోయింది. అప్పుడు అక్షయ్‌తో ఈ పాటను తెరకెక్కిస్తే, ఇప్పుడు అభిషేక్ సరసన ఆడిపాడుతోంది అంతే.