Begin typing your search above and press return to search.

ఆశిన్ పెళ్లి కి ముహూర్తం ఫిక్స్

By:  Tupaki Desk   |   23 Dec 2015 12:18 PM GMT
ఆశిన్ పెళ్లి కి ముహూర్తం ఫిక్స్
X
హీరోయిన్ ఆశిన్ కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. గత కొన్నేళ్లుగా మైక్రోమాక్స్ సెల్ ఫోన్ల తయారీ సంస్థ కో ఫౌండర్ రాహుల్ శర్మతో.. ఆశిన్ పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. అయితే.. ఫలానా రోజు పెళ్లి అంటూ కొన్నిసార్లు మీడియాలో వార్తలు వచ్చినా.. ఈ హీరోయిన్ మాత్రం అధికారికంగా చెప్పలేదు. ఈ సారి మాత్రం ముహూర్తం పక్కా అయిపోయినట్లు తెలుస్తోంది. జనవరి 23న ఆశిన్-రాహుల్ జంట ఒక్కటి కాబోతున్నారు.

ఢిల్లీలో ఈ మ్యారేజ్ జరగనుండగా.. ఆ తర్వాత ముంబై వచ్చి సినీ స్టయిల్లో అందరికీ భారీ పార్టీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రధాన ఆహుతులకు బంగారం రంగులో ఉన్న వెడ్డింగ్ కార్డ్ ను స్వయంగా పంచేస్తున్నారు వీరు. ఇలా స్వయంగా వచ్చి ఆహ్వానాలు అందించి, సంప్రదాయంగా పిలుస్తుండడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఓ మెసేజ్ నో - మెయిల్ నో పంపేసి ఇన్విటేషన్ అనుకునే రోజుల్లో.. ఇలా నెల ముందే వచ్చి పిలుస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే చాలామంది వెడ్డింగ్ కార్డులు పోస్ట్ ద్వారా అందుతున్నాయి. అందులో ఉన్నదే ఈ జనవరి 23 డేట్.

అలాగే ట్విట్టర్ లోనో - ఓ ప్రెస్ మీట్ లోనో ఆశిన్ నేరుగా అనౌన్స్ చేస్తే ఇంకా బాగుంటుందిగా అంటున్నారు ఫ్యాన్స్. ఆ ఐడియా కూడా ఆశిన్ -రాహుల్ కు ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మొత్తానికి పలు భాషల్లో దుమ్ము దులిపేసిన ఈ కేరళ భామ.. చివరకు ఇలా ఢిల్లీ కోడలు అవుతోంది.