Begin typing your search above and press return to search.

మ‌లైకా ఆస్తుల గురించి అడిగితే రుస‌రుస‌లాడిన‌ ప్రియుడు!

By:  Tupaki Desk   |   10 Aug 2021 2:30 AM GMT
మ‌లైకా ఆస్తుల గురించి అడిగితే రుస‌రుస‌లాడిన‌ ప్రియుడు!
X
ఒంపుసొంపుల జ‌వానీ మ‌లైకా అరోరా ఎక్క‌డికి వెళ్లినా త‌న‌వెంటే కెమెరాలు ఫ్లాష్ లు మెరిపించేందుకు సిద్ధంగా ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. బీచ్ కి వెళ్లినా.. మార్కెట్ కి వెళ్లినా.. జిమ్ కి యోగా సెష‌న్స్ కి లేదా బ‌జార్ కి ఎక్క‌డికి వెళ్లినా త‌న‌నే కెమెరా క‌ళ్లు వెంటాడుతాయి. తాజాగా మ‌రో రేర్ క్లిక్ ని సోష‌ల్ మీడియాల్లో ముంబై ఫోటోగ్రాఫ‌ర్లు షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. మ‌లైకా అలా షాపింగ్ నుంచి వ‌స్తూ రోడ్ సైడ్ గ‌ట్టు దిగుతూ టైట్ డ్రెస్ లో హొయ‌లు పోతుంటే కెమెరా ఫ్లాష్ మెరిసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా దూసుకుపోతోంది.

మ‌రోవైపు మ‌లైకా ఆస్తుల వ్య‌వ‌హారం ప్ర‌శ్నించ‌గా ప్రియుడు అర్జున్ సీరియ‌స్ అవ్వ‌డం నెటిజ‌నుల్లో హాట్ డిబేట్ గా మారింది. ఇటీవ‌ల అర్జున్ కపూర్ ఆస్తుల్ని మలైకా అరోరా సంపదతో పోల్చి చూడ‌డంపై ఈ జంట‌ తీవ్రంగా స్పందించారు. కొంతకాలంగా మలైకా అరోరాతో డేటింగ్ చేస్తున్న నటుడు అర్జున్ కపూర్ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో తన సంపదను మలైకాతో పోలుస్తూ ఓ ఘాటైన‌ నివేదికను రూపొందించారు.

మలైకా సంపద మూలాన్ని ప్రశ్నించే శీర్షికల‌కు అర్జున్ జ‌వాబిచ్చే ప్ర‌య‌త్నం చేసినా ఆ త‌ర్వాత ఆ పోస్ట్ ని తొల‌గించారు. ``2021 లో ఇలాంటి డాఫ్ట్ హెడ్ లైన్ చదవడం విచారంగా సిగ్గుగా ఉంది. వాస్తవానికి ఆమె బాగా సంపాదిస్తుంది. త‌న‌ని వేరొక‌రితో పోల్చాల్సిన స్థానంలో ఉండటానికి చాలా సంవత్సరాలు ఈ రంగంలో పనిచేసింది. నన్ను ఒంటరిగా వదిలేయండి`` అంటూ అర్జున్ విసుక్కున్నాడు. దశాబ్దాల కెరీర్ తో మలైకా ఎంతో ఆర్జించారు. న‌టిగా.. నిర్మాతగా.. టెలివిజన్ హోస్ట్ గా.. రియాలిటీ షో జడ్జిగా కూడా పనిచేశారు. ఇప్ప‌టికీ కెరీర్ లో ఎంతో బిజీ.

అర్జున్ - మలైకా తరచుగా సోషల్ మీడియాలో ఒకరికొకరు ఫోటోలను పంచుకుంటారన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌రికొక‌రు క్లిక్ చేసిన ఫోటోల‌ను వదులుతారు. గత సంవత్సరం కూడా ఈ జంట వివాహం చేసుకున్నట్లు పుకార్లు వచ్చిన‌ప్పుడు అర్జున్ సీరియ‌స్ అయ్యారు. తన వివాహాన్ని అభిమానులకు చెప్ప‌కుండా దాచనని అర్జున్ అన్నారు. తాను.. మలైకా ఇంకా పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించడం లేదని చెప్పాడు. మ‌లైకా ఇంతకు ముందు స‌ల్మాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకుంది. ఆమెకు అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. విడాల‌కులు అయిన క్ర‌మంలో అర్జున్ తో రిలేష‌న్ లో ఉన్నారు.