Begin typing your search above and press return to search.
ఇలాంటి ఐడియా ఏపీ-టీఎస్ పోలీసులకు రాదా?
By: Tupaki Desk | 11 July 2020 5:00 AMప్రపంచానికి కరోనా గొప్ప పాఠాల్ని నేర్పిస్తోంది. పరిశుభ్రతపై లెస్సన్స్ కొనసాగుతున్నాయి. బయటకు వెళితే మాస్క్ ధరించడం.. శానిటైజర్ లేదా హ్యాండ్ వాష్ ఉపయోగించడం తప్పనిసరి. ప్రభుత్వాల ఆదేశానుసారం ఇవన్నీ పాటించాల్సిందేనంటూ సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు. డాక్టర్లు.. పోలీసులు దీనిని ఒక ఉద్యమంలా చేపడుతున్నారు.
మాస్క్ ధారణపై ప్రచారంలో క్రియేటివిటీ ఇటీవల ఆకట్టుకుంది. మొన్నటికి మొన్న బాహుబలి పోస్టర్ లో ప్రభాస్ - రానా (బాహుబలి వర్సెస్ భళ్లాలదేవ) లకు మాస్కులు తొడిగిన పోస్టర్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అది మాస్క్ ప్రచారానికి బాగానే కలిసొచ్చింది.
తాజాగా అస్సాం పోలీసులు `రాధే శ్యామ్` ఫస్ట్ లుక్ ను ఫోటో షాప్ చేసి `మాస్క్`కి ప్రచారం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫోటోషాప్ చేసిన ఈ పోస్టర్లో ప్రభాస్ - పూజా హెగ్డే జంట ముసుగు ధరించి రొమాన్స్ చేస్తున్నారు. పోస్టర్ ప్రచారం ఆసక్తిని రేకెత్తించింది.
``మీ ప్రియమైన వారు ఎవరైనా బయటకు వచ్చినప్పుడల్లా మాస్క్ ధరించమని చెప్పండి. మేం ప్రభాస్ కి చెప్పేందుకు ప్రయత్నించాం.. కానీ మా ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు ఫోటోషాప్ ద్వారా సందేశాన్ని పంపుతున్నాం`` అంటూ అస్సాం పోలీసులు ట్వీట్ చేశారు. ఇదేమీ `రాధే శ్యామ్`ని అపహాస్యం చేయడం కాదు.. కేవలం ఛమత్కారంతో అవగాహన పెంచడమే దీని ఉద్ధేశం అని తెలిపారు. మొత్తానికి ఇలాంటి ఐడియా మన తెలంగాణ-ఏపీ పోలీస్ కి రాదా? అన్న సందేహం కలిగించారు అస్సామీలు.