Begin typing your search above and press return to search.

ఆ హీరో ద‌గ్గ‌ర పనోళ్ల‌కు ఫ‌స‌క్‌

By:  Tupaki Desk   |   21 Nov 2018 1:30 AM GMT
ఆ హీరో ద‌గ్గ‌ర పనోళ్ల‌కు ఫ‌స‌క్‌
X
సెల‌బ్రిటీల ద‌గ్గ‌ర పనోళ్ల ప‌రిస్థితేంటి? వంట వండేవాడు.. ఇంటి ప‌ని చేసేవాడు.. బ‌ట్ట‌లుతికే వాడు.. లేదా ఆఫీస్ వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్దేవాడు.. మేనేజ‌ర్ లేదా న‌మ్మ‌క‌స్తుడు.. ఇలా ఏదో ఒక ప‌నితో సెల‌బ్రిటీ జీవితంలో భాగ‌మ‌య్యే ప‌నోళ్ల సంగ‌తేంటి? కాయా పండా? సుఖ‌మా క‌ష్ట‌మా? న‌ష్ట‌మా లాభ‌మా? అన్ని ర‌క‌ర‌కాల కోణాల్లో ప‌రిశోధిస్తే టాలీవుడ్ సెల‌బ్రిటీల ఇళ్ల‌లో ప‌నోళ్ల ప‌ని అంత సులువేం కాద‌ని తాజా స‌ర్వే తేల్చి చెప్పింది.

ఇక్క‌డ ప‌ని చేసేవాళ్ల‌కు జీతాలు ప‌క్కాగా ఉంటాయి. ఒక‌టో తారీఖున అకౌంట్లో ప‌డ‌తాయి. అలాగే ఫ్యామిలీలో ఎవ‌రికైనా ఏదైనా ఆప‌ద వ‌స్తే ఆదుకునే మాన‌వ‌త్వం సెల‌బ్రిటీల్లో ఉంది. అంతేకాదు పండ‌గ‌లు ప‌బ్బాల్లో ప‌నోళ్ల‌కు బోన‌స్‌ లు ఇత‌ర‌త్రా స‌ర్‌ ప్రైజ్‌ లు వ‌గైరా ఉండ‌నే ఉంటాయి. అప్పుడ‌ప్పుడు ప‌నోడి ప‌నిత‌నం న‌చ్చితే ఊహించ‌ని స‌ర్‌ ప్రైజ్ గిఫ్టులు అందుతాయి. అదంతా బాగానే ఉంటుంది. ఇక రెండో కోణమే టూమ‌చ్‌ హారిబుల్ గా ఉంటుందిట‌. ప‌ని ఎంత బాగా చేయించుకుంటారో - ప‌నిలో తేడా వ‌చ్చినా అంతే చెమ‌డాలు వ‌లిచేస్తార‌ట కొంద‌రు. తోలు వొలిచి తిత్తి తీసి త‌ళాంగుత‌కిదిమితోం అయ్యాక వ‌దిలిపెడ‌తార‌ట‌. ఆ హింస మామూలుగా ఉండ‌దు బాబోయ్ అని ఓ హీరో ద‌గ్గ‌ర ప‌ని చేసినాయ‌న వాపోయిన సంద‌ర్భం ఉంది. చీటింగ్ కేసుల్లో బుక్క‌యిన చిల్ల‌ర దొంగ‌ల్ని పోలీసోళ్లు చీల్చి చెండాడిన చందంగా ఒంటిపై గాయాలు అయితే కనిపించ‌వు కానీ - మాన‌సికంగా మాత్రం ఆ రేంజులోనే కుళ్ల‌బొడిచేస్తార‌ట‌. సెల‌బ్రిటీల ద‌గ్గ‌ర ప‌నంటే అంత వీజీ కాదు. ఏదో గ్లామ‌ర్ వర‌ల్డ్ క‌దా!అని మోజు ప‌డితే ఆ త‌ర్వాత డీ తీరిపోతుందిట‌.

మినిమం మేనేజ‌ర్ పోస్టులో ఉన్న వాళ్ల‌కు ఈ తంటాలు మ‌రీ ఎక్కువ‌. ఓ ప్ర‌ముఖ హీరో త‌న‌ద‌గ్గ‌ర ప‌ని చేసేవాళ్ల తోలు వ‌లిచే వైనం .. మాన‌సిక హింస గురించి అప్ప‌ట్లో బ‌య‌ట బోలెడంత‌ టాక్ న‌డిచింది. అత‌గాడికి మండితే.. మూడ్ బాగోపోతే ఆరోజు ఎవ‌డైనా క‌నిపించాడా.. అంతే సంగ‌తి. మూడ్ బాగోపోతే పైగా ఓ పెగ్గు వేస్తే.. ఇక ఆ త‌ర్వాత ఉంట‌దీ భ‌జ‌న భ‌జ‌న‌ భ‌జ‌న‌. ప‌నోడు త‌ప్పు చేసి దొరికిపోయాడో తోలు వ‌లుచుడే. ఒక‌వేళ త‌ప్పు చేయ‌క‌పోయినా ఆ టైమ్‌ లో క‌నిపిస్తే దంచుడే. ముందు తిట్లు భ‌రించాలి. చీవాట్లు ఓర్పుగా ప‌డాల్సి ఉంటుంది. అయితే అలాంటి స‌న్నివేశం ఉంది అంటే పనోళ్ల‌ను కాపాడేందుకు స‌ద‌రు హీరోగారి వైఫ్ కాస్తంత మంచి మ‌న‌సు చేసుకుని సాయ‌ప‌డేవార‌ట‌. ముందే అక్క‌డ స‌న్నివేశం ఎలా ఉందో తెలుసుకుని బాబూ ఈసారికి రాకు .. ఈరోజుకు దూరంగా ఉండు!! అని చెప్పేస్తార‌ట మ్యాడ‌మ్. ఈరోజు రావొద్దు ప్లీజ్ అనేస్తుందిట‌. ఆరోజు మిస్స‌యితే మ‌ర్నాడు మూడ్ బావున్న‌ప్పుడు పిలిచి 2.0 ఫ్రీక్వెన్సీ నుంచి 1.0 ఫ్రీక్వెన్సీకి త‌గ్గి.. లోలెవ‌ల్లో కోటింగ్ ప‌డుతుంది. ఇదంతా సెకండ్ డే టాస్క్‌..!! మ్‌ మ్‌ మ్మ్ ... ఇప్పుడెవ‌రైనా చేర‌తారా సెల‌బ్రిటీల కొంపల్లో ప‌నికి? భూంభూం... మ‌టాష్‌! త‌స్మాత్ జాగ్ర‌త్త‌!!!