Begin typing your search above and press return to search.

అసురుడు తగ్గాడండోయ్

By:  Tupaki Desk   |   25 May 2015 12:06 PM IST
అసురుడు తగ్గాడండోయ్
X
సోలోగా వచ్చి వైవిధ్య చిత్రాలతో తనకంటూ ఓ శైలి ఏర్పరచుకున్న నటుడు నారా రోహిత్. సున్నితమైన భావోద్వేగాలతో కమర్షియల్ ఫార్మాట్ సినిమాని మలిచి మంచి విజయాలను అందుకున్నారు. రోహిత్ నటించిన తాజా చిత్రం అసుర. గుడ్ ఈజ్ బాడ్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా పేరులోనే కాదు ప్రచార చిత్రాలు చూస్తున్నా కూడా ఇదీ ప్రత్యేకంగానే వుండబోతోందని స్పష్టమవుతోంది. కృష్ణ విజయ్ దర్శకుడిగా 29న వస్తాడనుకున్న అసురుడు ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గాడు.

మే 29న రామ్ పండగ చేస్కో విడుదల అవుతోంది. కోన స్క్రీన్ ప్లే ప్రభావం, వరుస విజయాలు ఇస్తున్న దర్శకుడు గోపీచంద్ మలినేని వల్ల ఈ సినిమా పై మంచి అంచనాలే వున్నాయి. ఇక ఇదేరోజున సూర్య రాక్షసుడిగా రానున్నారు. రామ్ సినిమా కంటే ఈ సినిమా పైనే ఎక్కువ మంది కళ్ళు వున్నాయి. వీటితో అనవసర పోరు ఎందుకనుకున్నాడో ఏమో గాని జూన్ 5న రావడానికి సుముఖత వ్యక్తం చేసాడు రోహిత్. ఆ రోజు కూడా జాదుగాడు సినిమా విడుదలవుతున్నా అప్పటికి అసురుడే ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం వుంది. ఆ విధంగా మంచి వ్యూహమే రచించాడు అసురుడు.