Begin typing your search above and press return to search.
చిరంజీవి అంటే చంద్రబాబుకు అంత రెస్పెక్ట్!
By: Tupaki Desk | 6 Jan 2017 10:55 AM GMTసాధారణంగా కామెంట్లు పాస్ చేసేయడం చాలా ఈజీ. అలాగే ఇద్దరు పెద్ద పెద్ద వ్యక్తులపై కామెంట్లు చేయడం కూడా ఈజీయే. అదిగో ఖైదీ నంబర్ 150 సినిమాకు విజయవాడలో పర్మిషన్ ఇవ్వలేదంటూ సిఎం చంద్రబాబును కామెంట్ చేయడం.. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఫెయిల్ కాబట్టి ఖైదీ నెం 150 కోసం నానా పాట్లు పడుతున్నారు అనడం.. ఇలాంటవన్నీ రోజూ వింటుంటాం. ఈ సమయంలో అసలు చిరంజీవి అంటే చంద్రబాబుకు ఎంత రెస్పెక్ట్ అనే విషయం నిర్మాత అశ్వినీదత్ ఒక ఇంటర్యూలో చెప్పారు.
కమ్యూనిటీ పేరుతో విడగొట్టి ఫిలిం ఇండస్ర్టీని చూసే చాలామందికి అసలు రైవల్ కమ్యూనిటీస్ కు చెందిన చిరంజీవి.. రాఘవేంద్రరావు.. అశ్వినీదత్ అండ్ అల్లు అరవింద్ థిక్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారనేది ఎప్పటికీ అర్దంకాని రాకెట్ సైన్స్. అయితే తాను 2004లో విజయవాడ నుండి కంటెస్ట్ చేయడానికి చిరంజీవి ముఖ్యం కారణం అంటూ వివరించారు. ఆ సందర్భంగా అసలు చిరంజీవి అంటే చంద్రబాబుకు ఎంత గౌరవం అనే విషయం కూడా చెప్పారు.
''అప్పట్లో నేను 2004లో చంద్రబాబు గారితో కలిసి పనిచేస్తున్నాను.. ఆయనపై చాలా గౌరవం ఉంది.. కాని సీటు కావాలి కంటెస్ట్ చేస్తాను అని అడిగేంత ధైర్యం లేదు. అదే విషయం ఒక రోజు కారులో వెళుతూ చిరంజీవి గారితో చెప్పాను. ఆయన రాజకీయాలెందుకు.. అందరూ రిజల్ట్స్ వెంటనే కావాలని కోరుకుంటారు.. రాకపోతే తిడతారు.. అంటూ సర్ది చెప్పి.. అయనాసరే నీకు కంటెస్ట్ చేయాలని ఉంటే నేను చంద్రబాబు గారితో మాట్లాడతాను అన్నారు. చెప్పినట్లే చంద్రబాబు గారికి ఫోన్ చేసి రేపొచ్చి మిమ్మల్ని కలుస్తాను అనగానే.. రా అన్నా రా అని అన్నారు .. మరుసటి రోజు తెల్లారి చిరంజీవి వెళ్ళగానే తన మానుషాలతో గేట్ తీయించి గేటు వరకు వచ్చి చిరంజీవిని రిసీవ్ చేసుకున్నారు. విజయవాడ నుండి ఎంపి టిక్కెట్టు అశ్వినీ దత్తుకు ఇవ్వాలి అని అడగ్గానే.. అక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపి గద్దె రామ్మోహన్ ను తప్పించి మరి.. ఆ టిక్కెట్ కేవలం చిరంజీవిగారు చెప్పారని నాకు ఇచ్చారు. చంద్రబాబుకు చిరంజీవి అంటే అంత గౌరవం. అలాగే ఈయనక్కూడా ఆయనంటే చాలా గౌరవం'' అంటూ అశ్వినీదత్ చెప్పుకొచ్చారు.
అటువంటిది 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు.. అశ్వినీదత్ ఇటు జంప్ కొట్టలేదు కాని.. ఒకవేళ ఇద్దరిలో ఏ పార్టీకైనా సీట్లు తక్కువొచ్చినా.. ఒకరి సపోర్టు ఒకరికిపడినా కూడా.. నేను మధ్యవర్తిత్వం చేస్తాను అంటూ అశ్వినీదత్ చెప్పడంతో.. అటు చంద్రబాబు ఇటు చిరంజీవి చాలా హ్యాపీ ఫీలయ్యారట. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన కూడా అన్నయ్య చిరంజీవి అనుకున్నట్లే తెలుగుదేశంతో చేతులు కలిపినట్లుంది. అంతే కదూ?!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/