Begin typing your search above and press return to search.
హత్యాచార అగంతకుల పీచమణిచేస్తాడా!
By: Tupaki Desk | 28 Dec 2019 7:36 AM GMTబర్నింగ్ టాపిక్ ని ఎంచుకుని సినిమా చేస్తే జనాల్లో అది వాడి వేడి చర్చకు తావిస్తుంది. ప్రస్తుతం యంగ్ హీరో నాగశౌర్య అలాంటి ఓ ఆసక్తికర టాపిక్ నే ఎంచుకుని ప్రయోగమే చేస్తున్నాడు. సరిగ్గా హైదరాబాద్ లో దిశ ఘటన కంటే చాలా ముందే దిల్లీలో సంచలనమైన ఓ ఘటన ను.. అలాగే ముంబైలో జరిగిన ఇన్సిడెంట్ ను స్ఫూర్తిగా తీసుకుని కథను రాసుకుని అందులో నటిస్తున్నాడు. అశ్వథ్థామ అనే ఆసక్తికర టైటిల్ ని ఎంచుకోవడం తోనే ఈసారి శౌర్య ప్రయత్నం లో ఏదో ఒక కొత్తదనం ఉందని అర్థమైంది.
తాజాగా అందుకు సంబంధించిన టీజర్ రిలీజైంది. టీజర్ ఆద్యంతం యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్ తో కట్టి పడేశాడు. అరాచక శక్తుల పీచమణిచే ఆవేశపరుడైన యువకుడిగా శౌర్య కనిపిస్తున్నాడని అర్థమవుతోంది. టీజర్ ఇప్పటికే జెట్ స్పీడ్ తో దూసుకెళ్లి 35లక్షల వ్యూస్ ని సాధించింది. ఇటీవల టీజర్ ఈవెంట్లో శౌర్య వెల్లడించిన విషయాలు ఆసక్తిని రేకెత్తించాయి.
శౌర్య మాట్లాడుతూ.. ``దిల్లీ- ముంబై లలో అమ్మాయిల పై జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నాను. `చలో`కి కథ రాశాను. కానీ పేరు వేసుకో లేదు. నాకు బేసిగ్గా కథలు రాయడం.. చెప్పడం ఇష్టం. అమ్మాయిలకు రక్షణ లేదు అందరూ బాగుండాలి అని ఈ సినిమా తీశాం. నాకు లవర్ బాయ్ ఇమేజ్ అంటే చాలా చిరాకు.. దాని నుండి బయటి కి వచ్చి రఫ్ గా వుండే క్యారెక్టర్ చేశాను. నాకు అలాగే ఉండటం ఇష్టం. మనోజ్ రెడ్డి నన్ను కొత్తగా చూపించాడు. నేను ఏదైతే కథ అనుకున్నానో దానిని చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. తేజ- గ్యారీ- మనోజ్- నేను మేం నలుగురం ఆరు నెలలు ట్రావెల్ చేసి కథ రాసుకున్నాం`` అని తెలిపాడు.