Begin typing your search above and press return to search.

ఆ తిప్పలు నాకూ తప్పలేదు!

By:  Tupaki Desk   |   28 Aug 2018 7:42 AM GMT
ఆ తిప్పలు నాకూ తప్పలేదు!
X
ప్రపంచం అంతా అందాలే ఉంటాయా? సూరజ్ బరజాత్య సినిమాల్లోని పాత్రల్లా జనాలు మంచితనం-కరుణ కలిపి పోతపోసిన అద్భుతాల్లా ఉంటారా? ఉండరు. దేనికైనా మంచి-చెడూ రెండు పార్శ్వాలు. సినిమా ఇండస్ట్రీ అందుకు అతీతమేమీ కాదు. అన్నీ చోట్ల ఉన్నట్టే ఇండస్ట్రీ లో కూడా కావలసినంత మంది లోఫర్లు ఉంటారు. లోఫర్లు ఉన్నప్పుడు క్యాస్టింగ్ కౌచ్ లేకుండా ఎలా ఉంటుంది?

ఇప్పటికే చాలామంది క్యాస్టింగ్ కోచ్ ఉందో అని మొత్తుకున్నారు. తాజాగా '@నర్తనశాల' హీరోయిన్ యామిని కూడా అదే అంశం గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్యాస్టింగ్ కోచ్ అనేది నిజమని - తనకు కూడా ఎదురైందని తెలిపింది. ఇండస్ట్రీ లో అమ్మాయిల నుండి 'ఫేవర్స్' ఆశించేవాళ్ళు ఉన్నారని - అదే సమయంలో అలాంటివే ఏమీ లేకుండా ప్రొఫెషనల్ గా వ్యవహరించేవాళ్ళు కూడా ఉన్నారని చెప్పింది. ఈ ఫిలిం ఇండస్ట్రీ ప్రయాణంలో తనకు వాళ్ళమ్మగారు తోడు నీడగా నిలబడ్డారని - అమ్మ సపోర్ట్ వల్లే తను ఈ సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని ఉండొచ్చని అభిప్రాయపడింది

సహజంగా తెలుగు ఇండస్ట్రీలో అందరూ హిందీ భామలు ఉంటారు కదా.. కానీ యామిని ఒక తెలుగు అమ్మాయి. పవన్ కళ్యాణ్ 'కాటమ రాయుడు' సినిమాలో కూడా నటించింది. నాలుగేళ్ళ నుండి మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తూ ఉందట. తన ఆశలన్నీ ఈ '@నర్తనశాల' పై పెట్టుకుంది. మరి తను హీరోయిన్ గా ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలని - మంచి సినిమాలు చేయాలని కోరుకుందాం. ఎంతైనా తెలుగు కదా.. పార్షియాలిటీ!!