Begin typing your search above and press return to search.
ఆ టైమ్ లో నా డ్రస్ నేను కుట్టుకున్నా
By: Tupaki Desk | 25 Jan 2021 3:30 AM GMTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ కెరీర్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న ఈమె ఒకప్పుడు అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడింది. ఆ విషయాన్ని స్వయంగా తానే చెబుతూ ఉంటుంది. కెరీర్ ఆరంభంలో కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డట్లుగా గతంలో చెప్పింది. మరోసారి ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసింది. రాష్ట్రపతి వద్దకు వెళ్లిన సమయంలో కొత్త డ్రస్ లేకపోవడంతో ఆ సమయంలో డబ్బులు కూడా లేకపోవడంతో నా డ్రస్ నేనే కుట్టుకున్నాను అంది.
56వ జాతీయ చలన చిత్ర వేడుకల్లో భాగంగా నేను నటించిన ఫ్యాషన్ సినిమా లో నటనకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు వచ్చింది. ఆ సమయంలో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. ఆ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంకు నేను వెళ్లాలంటే ఒక డ్రస్ లేకుండా అయ్యింది. ఆ సమయంలో నా వద్ద డబ్బు లేకపోవడంతో నేనే స్వయంగా డ్రస్ డిజైన్ చేసుకుని కుట్టుకున్నాను అంది. ఆ సమయంలో నా కెరీర్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొందరు ఇండస్ట్రీలో నన్ను తొక్కేయాలని చూసినా కూడా నేను మాత్రం కష్టపడ్డాను అంది.