Begin typing your search above and press return to search.
ఆ టైమ్ లో డిప్రెషన్ కు వెళ్లి పోయా
By: Tupaki Desk | 15 July 2021 3:30 AM GMTఫ్యామిలీ హీరోగా సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగించిన శ్రీకాంత్ ఈమద్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఇంకా హీరోగా నటించాలనే తనప ఉన్నా కూడా పరిస్థితులు సహకరించక పోవడం వల్ల శ్రీకాంత్ విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను షురు చేశాడు. బాలయ్య.. బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందుతున్న సినిమాలో శ్రీకాంత్ మెయిన్ విలన్ అంటున్నారు. బాలయ్య.. బోయపాటి గత చిత్రం లెజెండ్ లో విలన్ గా జగపతిబాబు నటించి మెప్పించాడు. ఆ సినిమా తో జగపతిబాబు టాలీవుడ్ లో మళ్లీ బిజీ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ తో బిజీ అవుతూ వరుసగా సినిమాలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కనుక శ్రీకాంత్ కూడా వరుసగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
శ్రీకాంత్ ఇటీవల ఒక మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెళ్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. కెరీర్ ఆరంభంలోనే వరుస విజయాలు దక్కించుకుని టాలీవుడ్ లో నిలదొక్కుకున్నాను అనుకుంటున్న సమయంలో ఒకే ఏడాది ఏకంగా ఏడు సినిమాలు ప్లాప్స్ గా నిలిచాయి. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను. అప్పుడే నా కెరీర్ ముగిసిందా.. నన్ను ప్రేక్షకులు ఎందుకు తిరష్కరిస్తున్నారు అంటూ నాలో నేను మదన పడుతూ ఉండేవాడిని. సినిమాలు మానేసి ఊరు వెళ్లి వ్యవసాయం పనులు చూసుకోవాలా అనేంత ఆలోచనల్లో పడ్డాడు. ఒకానొక సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లి పోయేవాడిని.
మెల్లగా డిప్రెషన్ నుండి బయటకు వచ్చాను. ఆ సమయంలో అన్నయ్య చిరంజీవి నాకు చాలా మద్దతుగా నిలిచారు. ఇంకా ప్రయత్నించాల్సిందిగా సూచించారు. అన్నయ్య సలహాలు మరియు ప్రోత్సాహం వల్ల మళ్లీ ఇండస్ట్రీలో ఇలా మీముందు ఉన్నాను అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. హీరోగా సుదీర్ఘ కాలం చేసిన వారు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో శ్రీకాంత్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఆయన ముందు ముందు జగ్గూ భాయ్ మాదిరిగా మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు దక్కించుకుంటాడేమో చూడాలి.