Begin typing your search above and press return to search.

ఆ టైంలో డ్రెస్ జిప్ చిరిగిందట.. ప్రియాంక టెన్షన్ మూమెంట్!

By:  Tupaki Desk   |   28 Jan 2021 5:30 PM GMT
ఆ టైంలో డ్రెస్ జిప్ చిరిగిందట.. ప్రియాంక టెన్షన్ మూమెంట్!
X
ఇండస్ట్రీలో ఫేవరేట్ హీరోయిన్స్ ఒకసారి తారసపడితేనే అల్లాడిపోతుంటారు అభిమానులు. అలాంటిది అదే ఫేవరేట్ హీరోయిన్ రోజు కనిపిస్తే అభిమానుల పరిస్థితి ఏంటి.. ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అందమైన హీరోయిన్ ప్రియాంక చోప్రా అభిమానులు. ఈమధ్య ప్రియాంక విరామం లేకుండా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. అలాగని ఊరికే కాదులెండి.. తనకంటూ హాజరు కావాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా! అలా హాజరైన సమయంలోనే మీడియా కంటపడుతుంది. ఇలా క్షణాలలో సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అయితే కొంతమంది అందాల భామలను ఎన్నిసార్లు చూసినా అభిమానులకు తనివితీరదు. అలాంటి శరీరాకృతిని కలిగి ఉంది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతే ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటోంది ప్రియాంక. పెళ్లయ్యాక పూర్తిగా భారతీయ సంస్కృతికి సెలవు పెట్టేసినట్లుంది.

అందుకే ఎప్పుడు చూసినా పాశ్చాత్య దుస్తులే ధరిస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా కొత్త ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో ప్రియాంక డ్రెస్సింగ్ స్టైల్ చూపరులను చూపు తిప్పుకోనివ్వదు అంటే నమ్మాల్సిందే. అయితే లాస్ట్ ఇయర్ కేన్స్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచిన డ్రెస్ తో ఫోటోలు పోస్ట్ చేసింది. అంతేగాక జిప్ సిస్టం కలిగిన ఆ డ్రెస్ లో ప్రియాంక బయటికి నవ్వుతూ కనిపించినా.. లోపల మాత్రం తన జిప్ చిరిగిపోయిందనే టెన్షన్ ఎక్కువగా ఉందంట. అయితే ఐదు నిమిషాలలో తన టీమ్ ఆ డ్రెస్ కుట్టివ్వడంతో తను త్వరగా రెడ్ కార్పెట్ పై నడిచి వెళ్ళిపోయినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇది తన లైఫ్ జరిగిన ఓ ఫన్ అండ్ నెర్వస్ మూమెంట్ అంటూ.. ఇలాంటివి మీ లైఫ్ లో కూడా ఉంటే షేర్ చేయండి' అని నోట్ రాసింది. బ్లాక్ అండ్ రెడ్ కలగలిపిన ఆ మెరిసే డ్రెస్ లో ప్రియాంక పుత్తడిబొమ్మలా మెరుస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.