Begin typing your search above and press return to search.
రాజుగారితో రాబోతున్న శ్రీమన్నారాయణ
By: Tupaki Desk | 19 Dec 2019 6:06 AM GMTప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా సమర్పకుడిగా పలు సినిమాలకు వ్యవహరించాడు. దిల్ రాజు సమర్పించిన సినిమా లేదంటే దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ లో వచ్చిన సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆ ప్రాజెక్ట్ పై పాజిటివ్ ఒపీనియర్ ఉంటుంది. అందుకే పలు చిన్న చిత్రాల నిర్మాతలు తమ సినిమాలను దిల్ రాజు బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లాలని భావిస్తారు. డబ్బింగ్ సినిమాలను కూడా దిల్ రాజు తన బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
మరో డబ్బింగ్ సినిమాతో దిల్ రాజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో రాబోతున్న దిల్ రాజు అంతకు ముందే అంటే జనవరి 1నే 'అతడే శ్రీమన్నారాయణ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంను సౌత్ లోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు. కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమాలపై జనాల్లో ఆసక్తి మరియు అంచనాలు పెరిగాయి. అందుకే ఈ సినిమాను తెలుగులో భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన అతడే శ్రీమన్నారాయణ చిత్రం ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కేజీఎఫ్ తర్వాత కన్నడ నాట మరో సంచలన చిత్రంగా ఇది నిలుస్తుందంటూ కన్నడ సినీ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు. అందుకే ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చాడు. తెలుగు రైట్స్ దక్కంచుకున్న దిల్ రాజు జనవరి 1న తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నాడు. మరి కొత్త సంవత్సరంను డబ్బింగ్ సినిమాతో మొదలు పెట్టబోతున్న దిల్ రాజుకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది.. అలాగే ఈ చిత్రంతో దిల్ రాజును వెంట బెట్టుకుని తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న రక్షిత్ కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.