Begin typing your search above and press return to search.

రాహుల్-అతియాశెట్టి వెడ్డింగ్ స్పాట్ ఫిక్సైంది!

By:  Tupaki Desk   |   6 Jan 2023 11:42 AM GMT
రాహుల్-అతియాశెట్టి వెడ్డింగ్ స్పాట్ ఫిక్సైంది!
X
కొత్త ఏడాది కోటి ఆశ‌ల‌తో అడుగులు పెట్టిన బాలీవుడ్ సెల‌బ్రిటీలు కొంద‌రు కొత్త జీవితానికి నాంది ప‌ల‌క‌డానికి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే సిద్దార్ధ్ మ‌ల్హోత్రా-కియారా అద్వానీ వివాహ బంధంతో ఒక‌టి కాబోతున్నారు. కొన్నేళ్ల ప్రేమ‌కి వివాహ బంధంతో పుల్ స్టాప్ పెట్టి భార్య భ‌ర్త‌లు కాబోతున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ జంట వివాహం చేసుకుంటున్నారు.

ఇరు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో నిరాడంబ‌రంగా పెళ్లి చేసుకుని అటుపై భారీ ఎత్తున ముంబైలో సెల‌బ్రిటీల‌కు రిసెప్ష‌న్ ఏర్పాటు చేయాల‌న్న‌ది ప్లాన్ గా తెలుస్తొంది. అయితే అంత‌కు ముందే బాలీవుడ్ ని పెళ్లి వాతావ‌ర‌ణం అతియాశెట్టి-కె.ఎల్ రాహుల్ తీసుకొస్తున్నారు. ఈ జంట కూడా అజ‌రామ‌ర ప్రేమ‌కి పుల్ స్టాప్ పెట్టి వావాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈనెల‌లోనే ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెడుతున్న‌ట్లు స‌మాచారం. ఖండాలాలోని అతియాశెట్టి తండ్రి సునీల్ శెట్టి ఇంటి జహాన్‌లో వివాహ వేదిక‌గా నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే విష‌యం బ‌య‌ట‌కు లీకైంది. కానీ అనివార్య కార‌ణాల‌తో అదే వేదిక ముంబైకి షిప్ట్ అవుతుంద‌ని అటుపై క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఖండాలే పెళ్లి వేదిక‌గా ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఇక్క‌డ చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఈ నివాసం ఆహ్లాద‌ర‌క‌మైన వాతావ‌ర‌ణంలో ఉంటుంది. చుట్టూ కొండలు.. పచ్చని చెట్లు మధ్య ఉంటుంది. భారీ ప్రదేశంలో విస్తరించి ఉంది. వివాహానికి ఎంతో అనువుగా ఉంటుంది. రాహుల్ కి ఆ ప్ర‌దేశం అంటే ఎంతో ఇష్టం. అలాగే అతియాకి అక్క‌డ ఎన్నో జ్ఞాప‌కాలున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రికి ఇష్ట‌మైన అంద‌మైన ప్ర‌దేశాన్ని వివాహ వేదిక‌గా మారుస్తున్న‌ట్లు తెలుస్తోంది.

జనవరి 21 నుండి 23 మధ్య ఈ జంట పెళ్లి చేసుకోనున్నారని సన్నిహిత వర్గాల స‌మాచారం. అతియా శెట్టి - రాహుల్ ఇటీవల దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలను ఘ‌నంగా జరుపుకున్నారు. ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నవంబర్ 2021లో ఈ జంట తమ సంబంధాన్ని అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి పెళ్లి ఎప్పుడంటూ మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు హీటెక్కించాయి. తాజాగా పెళ్లి క‌బురుతో! అన్ని చ‌ల్ల‌బ‌డ్డాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.