Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల దారుణాలు?
By: Tupaki Desk | 13 April 2022 12:30 AM GMTరష్యా, ఉక్రెయిన్ యుద్ధం అందరిని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం వద్దనే వాదనలు వస్తున్నా రష్యా మాత్రం లెక్క చేయడం లేదు.ఫలితంగా ఉక్రెయిన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఇక్కడ రష్యా సేనల ప్రతాపం చూస్తుంటే అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉక్రెయిన్ వాసులపై అమానవీయ ఘటనలకు పాల్పడుతోందని అంతర్జాతీయ సమాజం విమర్శలు చేస్తోంది. అయినా రష్యా మాత్రం తగ్గడం లేదు తన కర్కశతత్వంతో ముందుకు వెళ్తోంది.
రష్యా సేనలు తల్లులపై సామూహిక అత్యాచారం, పసిపాపలపై లైంగిక దాడులు అందరిని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పుతిన్ సేనల తీరు వివాదాస్పదమవుతోంది. మనుషులను హింసించమనే నినాదంతో వచ్చిన రష్యా సేనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఉక్రెయిన్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పలు స్వచ్ఛంధ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
రష్యా సైనికుల దారుణాలపై తొమ్మిది ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. 12 మంది మహిళలపై అత్యాచారం, లైంగిక దాడులు జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో రష్యా ఘాతుకాలకు అంతే లేకుండా పోతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ను రష్యా సేనలు నిలువెల్లా దోచేందుకు తయారుగా ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లను సైతం పెడచెవిన పెడుతూ వారి సాగిస్తున్న మారణహోమానికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో తెలియడం లేదు.
ఫిబ్రవరి 24న మొదలైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నానాటికి పెరుగుతోంది. మహిళలు, చిన్నారులపై లైంగికదాడి చేయడం అత్యంత పాశవిక చర్యగా అభివర్ణిస్తున్నారు. రష్యా సేనల తీరుతో విమర్శలు వస్తున్నా పుతిన్ మాత్రం ఇది మాపై నిందలు మోపేందుకే జరుగుతున్న దురాగాతాలుగా చెబుతుండటం విశేషం. రష్యా ఆగడాలపై దర్యాప్తు చేయాలనే వాదనలు కూడా వస్తున్నాయి.
మొత్తానికి రష్యా తన ప్రతాపం ఉక్రెయిన్ పై చూపుతోంది, ఆస్తులనే కాదు ప్రజలను సైతం లకష్యంగా చేసుకుని రాక్షసంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్ లో ఇంకా ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయోనని అందరిలో ఆందోళన నెలకొంది. యుద్ధ కాంక్ష తప్పని తెలిసినా రష్యా మాత్రం పట్టించుకోవడం లేదు. దాని ప్రభావం మాత్రం ప్రపంచం మొత్తం అనుభవిస్తోంది.