Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : ఎటాక్
By: Tupaki Desk | 1 April 2016 8:04 AM GMTచిత్రం: ‘ఎటాక్’
నటీనటులు: మంచు మనోజ్-జగపతిబాబు-ప్రకాష్ రాజ్-వడ్డే నవీన్-సురభి-అభిమన్యుసింగ్-ప్రభ-పూనమ్ కౌర్ తదితరులు
సంగీతం: రవిశంకర్
ఛాయాగ్రహణం: అంజి
రచన: సమీర్ చంద్ర
నిర్మాతలు: శ్వేత లానా-వరుణ్-తేజ-సీవీ రావు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
మంచు మనోజ్-జగపతిబాబు-ప్రకాష్ రాజ్.. ఇలాంటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కిందంటే జనాల్లో ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా ఈ కాంబినేషన్ లో రామ్ గోపాల్ వర్మ లాంటి సంచలన దర్శకుడు సినిమా తీయడం.. అది కూడా వర్మకు పట్టున్న ఫ్యాక్షన్ నేపథ్యంలో కావడంతో ‘ఎటాక్’ మీద ఆసక్తి రెట్టింపైంది. ఎప్పుడో ఏడాది కిందటే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. పలుమార్లు వాయిదా పడి.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
చాలా ఏళ్ల కిందట రౌడీయిజం వదిలేసి కుటుంబం కోసం వ్యాపారంలోకి వచ్చేసిన గురురాజ్ (ప్రకాష్ రాజ్)ను పాత కక్షలతో ఓ ముఠా హత్య చేస్తుంది. అతడి ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడైన కాళి (జగపతిబాబు) తండ్రిని చంపిన వాళ్లను చంపాలని పగతో రగిలిపోతుంటాడు. అతడి పెద్ద తమ్ముడు భూపి (వడ్డే నవీన్) పిరికివాడు. చిన్నతమ్ముడు రాధాకృష్ణ (మంచు మనోజ్)కు ఈ గొడవలన్నీ ఏమీ పట్టవు. ఐతే ప్రత్యర్థులు పన్నిన కుట్రలో కాళి కూడా ప్రాణాలు కోల్పోవడంతో రాధాకృష్ణలో మార్పు వస్తుంది. అతడిక శత్రు సంహారానికి దిగుతాడు. తండ్రి.. అన్నయ్యల్ని చంపినవాళ్లపై అతనెలా పగతీర్చుకున్నాడన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
రామ్ గోపాల్ వర్మ గత దశాబ్ద కాలంలో చాలా సినిమాలు తీశాడు. కానీ వాటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవి రక్తచరిత్ర.. ముంబయి అటాక్స్.. కిల్లింగ్ వీరప్పన్ మాత్రమే. ఈ మూడు సినిమాలకు ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే.. అవి వాస్తవ కథలతో తెరకెక్కాయి. జనాలపై చాలా ప్రభావం చూపించిన.. సంచలనాలకు కేంద్రంగా నిలిచిన.. నిజజీవిత ఘటనల్ని కథాంశంగా తీసుకుని తనదైన శైలిలో వాటికి వెండితెర రూపం ఇచ్చాడు వర్మ. జనాల్లో విపరీతమైన ఆసక్తి రేపిన సంఘటనల తాలూకు వాస్తవాల్ని.. లోతుల్ని తన మార్కు టేకింగ్ తో వెండితెరపై ఆవిష్కరించాడు వర్మ. ఎమోషనల్ గానూ కదిలించే కథలు కావడం.. పైగా ఆయా కథల్లో ఆసక్తికర మలుపులు కూడా ఉండటంతో ఈ సినిమాలతో జనాలు బాగా కనెక్టయ్యారు.
‘ఎటాక్’ కూడా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమానే అని వర్మ చెప్పాడు కానీ.. ఆ వాస్తవ సంఘటనలేవో వెల్లడించలేదు. దీంతో ఈ కథ మీద పైన చెప్పుకున్న మూడు సినిమాల తరహాలో జనాలు ప్రత్యేకమైన ఆసక్తి చూపించే అవకాశం లేదు. పోనీ మనకు తెలియని కథలోనే ఏదైనా స్పెషాలిటీ ఉందేమో అని చూస్తే.. అణుమాత్రమైనా ఏ ప్రత్యేకతా కనిపించదు ఇందులో. వాస్తవంగా ఏం జరిగిందో కానీ.. వర్మ కూడా సినిమాటిక్ మలుపులేమీ జోడించే ప్రయత్నం చేయలేదు. ఒక సాధారణ రివెంజ్ డ్రామాను వర్మ టేకింగ్ లో చూస్తాం తప్పితే... ‘ఎటాక్’లో అంతకుమించి ఏ ప్రత్యేకతా కనిపించదు.
ఆ మధ్య వర్మ శిష్యుడొకరు ‘బెజవాడ’ అనే సినిమా తీశాడు గుర్తుందా? అదే కథను వేరే నటీనటులతో తాను తీస్తే ఔట్ పుట్ ఎలా ఉంటుందో చూద్దామని వర్మ ఓ ట్రయల్ వేసినట్లుగా అనిపిస్తుంది ‘ఎటాక్’ చూస్తుంటే. బెజవాడ నేపథ్యం కాస్తా పాత బస్తీకి మారింది. నాగచైతన్య ప్లేస్ లోకి మనోజ్ వచ్చాడు. అందులో హీరో అన్నయ్యను ప్రత్యర్థులు చంపితే.. ఇక్కడ హీరో తండ్రి బలవుతాడు. మళ్లీ విలన్ మాత్రం అక్కడా ఇక్కడా అభిమన్యు సింగే. కాకపోతే ‘ఎటాక్’ వర్మ తీశాడు కాబట్టి.. టేకింగ్ కొంచెం మెరుగ్గా ఉంటుంది. ‘ఎటాక్’లో ఇంతకుమించి చెప్పుకోవడానికేమీ లేదు.
ప్రకాష్ రాజ్.. జగపతిబాబు.. మనోజ్ లాంటి వాళ్లు చేశారంటే ఇవేవో ప్రత్యేకమైన పాత్రలై ఉంటాయని అనుకుంటాం కానీ.. వాళ్ల స్థాయికి ఏమాత్రం తగని జీవం లేని పాత్రల్ని ఇచ్చాడు వర్మ. ఒక పాత్రకు కూడా సరైన క్యారెక్టరైజేషన్ లేదు. పోస్టర్లలో కనిపించిన ఇంటెన్సిటీ సినిమాలో ఏ పాత్రలోనూ లేదు. కేవలం నాలుగైదు మాటల్లో ఇదీ ఈ క్యారెక్టర్ అని చెప్పేస్తే ఇక ఆ పాత్రతో జనాలు ఎలా కనెక్టవుతారు? మామూలుగా వర్మ సినిమాల్లో పాత్రలకు సంబంధించి పెద్దగా డీటైలింగ్ ఉండకపోయినా కానీ.. ఒక బలమైన సన్నివేశం లేదా బలమైన ఎమోషన్ ద్వారా ఆ పాత్ర ఏంటన్నది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇందులో కథకు కీలకమైన ప్రకాష్ రాజ్ పాత్రకు సంబంధించి అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు.
నేరుగా ప్రకాష్ రాజ్ హత్యతో సినిమాను మొదలెట్టేసిన వర్మ.. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ద్వారా కూడా ఆ పాత్ర నేపథ్యాన్ని చూపించే ప్రయత్నం చేయలేదు. ‘‘మా నాన్న ఏం చెప్పాడంటే..’’ అంటూ వర్తమానంలో కొడుకుల్లో ఒకకరు ఆయన్ని గుర్తు చేసుకుంటే.. ప్రకాష్ రాజ్ ఏదో ఒక కొటేషన్ చెబుతూ కనిపిస్తాడు. ఇదీ కథ ఎవరి చుట్టూ తిరుగుతుందో ఆ పాత్రను వర్మ తీర్చిదిద్దిన వైనం. ఓ దశ దాటాక ఈ కొటేషన్లు కామెడీ అయిపోతాయి. ఇలాంటి పాత్రతో ప్రేక్షకులు ఎక్కడ కనెక్టవుతారు.. హీరో ప్రతీకారాన్ని తమదిగా ఎలా భావిస్తారు? ప్రకాష్ రాజ్ అనే కాదు.. జగపతి బాబు.. మంచు మనోజ్.. ఇలా ప్రతి క్యారెక్టరూ ఇంతే పేలవంగా ఉంటుంది.
ముందు హీరో ఫ్యామిలీ మీద వరుస అటాక్స్ జరగడం.. ద్వితీయార్ధంలో హీరో సైలెంట్ ఆపరేషన్ తో విలన్ గ్యాంగు పనిపట్టడం.. అంతే కథ. ఎక్కడా ఉత్కంఠ ఉండదు.. మలుపులు ఉండవు. ఒకరి మీద ఒకరు చేసుకునే సాదాసీదా అటాక్స్ తప్పించి.. సినిమాలో ఏమీ లేదు. వర్మ సినిమాల్లో ఇలాంటి ఎటాక్స్ ‘శివ’ దగ్గర్నుంచి మొన్నటి ‘కిల్లింగ్ వీరప్పన్’ వరకు చాలా చూశాం. దీంతో ప్రేక్షకులకు ఎక్కడా ఏదీ కొత్తగా.. ఆసక్తికరంగా అనిపించదు. కాస్త నిడివి ఎక్కువున్న ‘నేరాలు ఘోరాలు’ ఎపిసోడ్ ను వర్మ టేకింగ్ లో చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది తప్ప ‘ఎటాక్’ ఏ రకమైన ముద్రా వేయదు.
నటీనటులు:
మంచు మనోజ్.. ప్రకాష్ రాజ్.. జగపతి బాబుల నుంచి చాలా ఆశిస్తాం. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాల మీద ఎన్నో అంచనాలు పెట్టుకుంటాం. కానీ ఈ విషయంలో తీవ్ర నిరాశ తప్పదు. ప్రకాష్ రాజ్.. జగపతి బాబుల టాలెంటుని వర్మ ఏమాత్రం ఉపయోగించుకోలేదు. వాళ్లిద్దరూ కూడా ఏదో మొక్కుబడిగా నాలుగు రోజులు నటించేసి వెళ్లిపోయినట్లున్నారు. మంచు మనోజ్ తన గత సినిమాలతో పోలిస్తే ఇందులో భిన్నంగా కనిపించాడు. అతడి గెటప్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో నటన బాగుంది. ఐతే పాత్రలో దమ్ము లేకపోవడం వల్ల అతడు చూపించిన ఇంటెన్సిటీ ఆ క్యారెక్టర్ కు సూటవ్వలేదు. క్లైమాక్స్ లో అతడి నటన అతిగా అనిపించడానికి కారణం అదే. వడ్డే నవీన్ పాత్ర.. అతడి నటన.. డైలాగ్ డెలివరీ.. చికాకు పుట్టిస్తాయి. అభిమన్యు సింగ్ ఓకే. సురభి.. పూనమ్ కౌర్ ల గురించి చెప్పడానికేమీ లేదు.
సాంకేతిక వర్గం:
వర్మ సినిమాల్లో సాంకేతిక నిపుణుల పేర్లు మారుతుంటాయి కానీ.. ఎవరు పని చేసినా ఔట్ పుట్ మాత్రం ఒకేలా ఉంటుంది. సంగీత దర్శకుడు రవిశంకర్.. ఛాయాగ్రాహకుడు అంజి.. అచ్చంగా వర్మ మార్కు పనితనమే చూపించారు. రవిశంకర్ బ్యాగ్రౌండ్ స్కోర్.. పాటలు.. చెవుల తుప్పు వదలగొట్టేస్తాయి. సన్నివేశాల్లో బలం ఉంటే బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేట్ అయ్యేదేమో కానీ.. చాలా వరకు ఈ లౌడ్ నెస్ చికాకు పెడుతుంది. కొన్ని సన్నివేశాల్లో కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. సమీర్ చంద్ర డైలాగులు బాగున్నాయి. కానీ సినిమాలో చాలా చోట్ల డైలాగులు సింక్ అవలేదు. నిర్మాణ విలువలు గొప్పగా ఏమీ లేవు. వర్మ టేకింగ్ పరంగా ఎప్పట్లాగే మెప్పించాడు కానీ.. కంటెంట్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచాడు.
చివరగా: బివేర్ ఆఫ్ దిస్ ‘ఎటాక్’
రేటింగ్- 2/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre