Begin typing your search above and press return to search.
కన్నడ హీరోపై దాడి.. రక్తం వచ్చేలా కొట్టారు..
By: Tupaki Desk | 14 Aug 2019 9:00 AM GMTకన్నడ హీరో కోమల్ మీద బెంగళూరులో తీవ్రదాడి జరిగింది. ఆయన కారును ఆపి మరీ ఓ దుండగుడు కారులోంచి బయటకు లాగి పిడిగుద్దులు గుద్దాడు. ఈ ధాటికి హీరో కోమల్ ముక్కు, నోటి వెంట రక్తం కారింది. అయినా ఆపకుండా చితకబాదాడు. ఇప్పుడు కోమల్ పై దాడిని రోడ్డుపై వెళుతున్న వారు వీడియో తీయడంతో ఇది వైరల్ గా మారింది.
హీరో కోమల్ తన కుమార్తెను స్కూలును తీసుకురావడానికి కారులో బెంగళూరులోని శ్రీరాంపుర రైల్వే సమీపం నుంచి వెళుతున్నాడు. ఈ సందర్భంగా మల్లేశ్వరం మార్గం మధ్యలో హీరో కమల్ కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఓ బైక్ పై వెళుతున్న వ్యక్తి దురుసుగా కారును తాకిస్తూ వెళ్లాడు. కారులో ఉన్న హీరో కోమల్ దీనిపై ఆ బైకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలా వెళితే యాక్సిడెంట్ అవుతుందంటూ హెచ్చరించాడు.
నన్నే ప్రశ్నిస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేసిన బైక్ పెళుతున్న శ్రీరంపురకు చెందిన విజీ అనే వ్యక్తి హీరో కోమల్ తో వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టి అనంతరం దాడి చేశాడు. ముఖం- ముక్కు- నోటిపై పిడిగుద్దులు గుద్దడంతో కోమల్ కు రక్తం కారిపోయింది. హీరోపైనే దాడి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా విజీ తాగిన మత్తులో ఉన్నాడని.. బహుషా అతడు గంజాయి తాగి ఉంటాడని.. వెనుకలా ఓ అమ్మాయి కూడా ఉందని ప్రాథమిక విచారణలో తేలినట్టే బెంగళూరు డీసీపీ శశికుమార్ వివరించారు. హీరో కోమల్ మీద దాడి చేసిన వ్యక్తిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారని వివరించాడు. దీన్ని సీరియస్ గా పరిగణిస్తున్నామని రౌడీషీటర్లకు తగిన శాస్తి చేస్తామని స్పష్టం చేశారు.
కాగా హీరో కోమలు సోదరుడు, ప్రముఖ హీరో బీజేపీ నాయకుడు జగ్గేష్ దీనిపై సీరియస్ అయ్యాడు. తన సోదరుడు కమల్ పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశాడు.