Begin typing your search above and press return to search.

మ‌నోజ్ సెట్‌ లో వివాదం.. నిర్మాత‌ను కొట్టారా?

By:  Tupaki Desk   |   2 Aug 2016 8:36 AM GMT
మ‌నోజ్ సెట్‌ లో వివాదం.. నిర్మాత‌ను కొట్టారా?
X
హీరో మంచు మ‌నోజ్ కొత్త చిత్రం ప్రస్తుతం విశాఖ‌ప‌ట్నం ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇంకా పేరు పెట్ట‌ని ఈ చిత్రాన్ని కొత్త నిర్మాత‌లు అచ్చిబాబు - ఎస్‌.ఎన్‌.రెడ్డిలు నిర్మిస్తున్నారు. కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే, ఆగ‌స్టు 1న వైజాగ్‌ లో షూటింగ్ జ‌రుగుతూ ఉండ‌గా... సెట్‌ లో గొడ‌వ చోటుచేసుకుంద‌ని తెలుస్తోంది. జూనియ‌ర్ ఆర్టిస్టులు కొంద‌రు సెట్ మీదికి దాడికి వ‌చ్చార‌నీ - నిర్మాత‌పై చేయి చేసుకున్నార‌ని కూడా స‌మాచారం.

కొంత‌మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల వాద‌న ఏంటంటే.. ఈ చిత్ర నిర్మాత‌లు త‌మ‌కు ఇస్తామ‌న్న సొమ్మును ఇంకా ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. రూ. 15 ల‌క్ష‌లు ఇస్తామ‌ని చెప్పి, ఇంకా రూ. 5 ల‌క్ష‌లు మాత్ర‌మే ఇచ్చార‌ని అంటున్నారు. ఇది అడిగేందుకు వెళ్తేనే గొడ‌వ జ‌రిగింద‌న్న‌ది వారి వాద‌న‌. ఇంకో వెర్ష‌న్ ఏంటంటే... ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ నియ‌మ నింబంధ‌న‌ల ప్ర‌కార‌మే న‌మోదు చేసుకున్న కొంత‌మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు సినిమాలో అవ‌కాశం ఇచ్చార‌ట‌. ఈ విష‌యం న‌చ్చ‌నివారు మ‌రికొంతమంది గుంపు సెట్‌ లోకి వ‌చ్చి - త‌మ‌కీ ఛాన్స్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశార‌ట‌. అలా కుద‌ర‌దు అని నిర్మాత‌లు - హీరో చెప్ప‌డంతో వివాదం చెల‌రేగింద‌నీ వ‌చ్చిన‌వారు సెట్‌ లో దాడికి దిగార‌ని చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలిపేందుకు హీరో మంచు మ‌నోజ్ విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. జూనియ‌ర్ ఆర్టిస్టుల‌దే త‌ప్పు అన్న‌ట్టుగా చిత్రించేందుకే ఈ స‌మావేశం ఏర్పాటు చేస్తున్నార‌ని కొంత‌మంది ఆరోపిస్తున్నారు. ఇంత‌కీ ప్రెస్ మీట్‌ లో మ‌నోజ్ ఏం మాట్లాడ‌తారో చూడాలి.