Begin typing your search above and press return to search.
సైరా థియేటర్లో దాడి.. ఇదే అనుమానితుడి ఫోటో
By: Tupaki Desk | 6 Oct 2019 8:21 AM GMTకెనడాలో 'సైరా' సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర పెప్పర్ స్ప్రే చల్లిన సంఘటన గురించి తెలిసిందే. ఒంటారియో ప్రావిన్సులోని కిచెనర్.. విట్బీ ఏరియాల్లో ఈ సంఘటనలు చోటు చేసుకోవడంతో లోకల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనలో స్ప్రే దాడికి పాల్పడ్డ అనుమానితుడి ఫోటోను పోలీసులు తాజాగా విడుదల చేశారు.
ఈ ఫోటోలో హుడ్ ఉండే బ్లాక్ కలర్ టీ షర్టు ధరించిన సన్నటి వ్యక్తి కనిపిస్తున్నాడు. గడ్డంతో ఉన్న వ్యక్తి వయసు దాదాపు పాతికేళ్ళు ఉండొచ్చని అంటున్నారు. మొదట ఈ వ్యక్తి కిచెనర్ లోని థియేటర్లో కి ఎంటర్ అయ్యాడని.. స్క్రీన్ ను కట్ చేసేందుకు ప్రయత్నించడాని సమాచారం. తర్వాత స్ప్రే దాడికి పాల్పడి అక్కడినుంచి పరారయ్యాడు. సరిగ్గా రెండు గంటల తర్వాత విట్బీ ఏరియాలో ఇలాంటి సంఘటనే జరగడంతో రెండిటికి లింక్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారట.
నిందితుడి ఆచూకి దొరికితే కానీ ఈ దాడికి వెనకున్న కారణాలు తెలియవు. అయితే ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాకపోవడం మాత్రం ఊపిరి పీల్చుకోవాల్సిన అంశం. అయితే ఈ సంఘటనల తర్వాత 'సైరా' స్క్రీనింగ్స్ ను రద్దు చేశారు