Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ ను ఎటాక్ చేయడం ఖాయం: సంపత్ రాజ్
By: Tupaki Desk | 2 Feb 2022 12:30 AM GMTసంపత్ రాజ్ ఇంతవరకూ 6 భాషల్లో 100 సినిమాలకి పైగా చేశారు. తనదైన స్టైలీష్ లుక్ తో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. కమల్ 'నాయకుడు'తో పాటు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసిన శరణ్య, ప్రస్తుతం తల్లి పాత్రలను చేస్తూ వెళుతున్నారు. ఆమె తన మాజీ భార్య అంటూ జరిగిన ప్రచారంపై ఈ వేదిక ద్వారా సంపత్ రాజ్ స్పందించారు.
"శరణ్య గారు నా ఎక్స్ వైఫ్ అనే వార్తలో ఎంతమాత్రం నిజం లేదు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ .. మీడియాలో అలా వచ్చేసింది.
నేను ఆల్రెడీ ఆ వెబ్ సైట్ కి లీగల్ నోటీసులు పంపించే పనిలోనే ఉన్నాను. అసలు ఆ వార్త ఎలా వచ్చిందో .. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నిజానికి నేను .. శరణ్యగారు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆమె హజ్బెండ్ నాకు మంచి ఫ్రెండ్. ఆయన కూడా ఈ గాసిప్ చూసి నవ్వుకున్నారు. ఆమె ఇద్దరు పిల్లలు మా అమ్మాయికి క్లోజ్ ఫ్రెండ్స్. ఒక సినిమాలో నేను .. శరణ్యగారు భార్యాభర్తలుగా యాక్ట్ చేశాము. ఆ ఫొటో పెట్టుకుని వాడు రాసేశాడు. నిజం మాకు తెలుసు కనుక ఆ న్యూస్ వలన ఎలాంటి న్యూసెన్స్ జరగలేదు.
నాకు త్రివిక్రమ్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. సాధారణంగా నేను ఏ సినిమా అయినా కథ .. నా పాత్ర విన్న తరువాతనే ఒప్పుకుంటాను. కానీ త్రివిక్రమ్ గారి సినిమాకి మాత్రం ఏమీ అడగకుండానే ఒప్పేసుకున్నాను. అప్పుడు ఆయన 'ఇది చాలా చిన్న రోల్ .. ఫ్యూచర్లో పెద్ద రోల్ ఇస్తాను' అన్నారు. ఆ తరువాత ఆయన చాలా సినిమాలు చేశారుగానీ .. నన్ను పిలవడం లేదు. దాంతో ఒక రోజు నేను "సార్ .. మీరు గనుక నెక్స్ట్ సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వకపోతే మాత్రం లొకేషన్ కి వచ్చి కెమెరా తీసుకుని వెళ్లిపోతాను" అని చెప్పాను.
ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఒక సినిమా చేస్తున్నారు .. త్రివిక్రమ్ గారిని ఎక్కడ పట్టుకోవాలి? అని మొన్న 'ఎఫ్ 3' షూటింగులో సునీల్ ని అడిగాను. అప్పుడు సునీల్ 'మీరు నన్ను ఏమీ అడగలేదు .. నేను మీకు ఏమీ చెప్పలేదు' అంటూనే, సాయంత్రాల్లో త్రివిక్రమ్ ఎక్కడ ఉంటాడనేది చెప్పాడు. ఒకటి రెండు వారాల్లో కచ్చితంగా ఆయన దగ్గరికి వెళతాను. నేను నా మాట మీద నిలబడాలి కనుక, తప్పకుండా ఎటాక్ చేస్తాను. ఇక బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి., వారానికి రెండు కాల్స్ అయినా ముంబై నుంచి వస్తుంటాయి. సరైన పాత్ర ద్వారా ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వెయిట్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.