Begin typing your search above and press return to search.
RRR దెబ్బకు తొలి రోజే తోక ముడిచిన 'ఎటాక్'..!
By: Tupaki Desk | 2 April 2022 11:30 AM GMTRRR సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్ళు రాబడుతోంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిక్షనల్ యాక్షన్ డ్రామా.. సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
అయితే ఈ వీక్ లో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం - రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ''ఎటాక్'' వంటి పెద్ద సినిమా విడుదల ఉండటంతో.. 'ఆర్.ఆర్.ఆర్' వసూళ్ళపై ప్రభావం పడుతుందని అందరూ భావించారు. అయితే ఎటాక్ మూవీ ఓపెనింగ్ డే నాడు RRR ని ఇబ్బంది పెట్టడం కాదు కదా.. కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది.
''ఎటాక్'' మూవీ మొదటి రోజును చాలా డల్ గా ప్రారంభించింది. హిందీ బెల్ట్ లో మోస్తరు వసూళ్లను కూడా నమోదు చేయలేకపోయింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల ప్రకారం జాన్ అబ్రహాం సినిమా ఫస్ట్ డే (శుక్రవారం) కేవలం ₹ 3.51 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇది RRR 8వ రోజు వసూళ్లలో 26 శాతమే అవడం గమనార్హం.
'ఆర్.ఆర్.ఆర్' సినిమా 8వ రోజు ₹ 13.50 కోట్లు రాబట్టి ఈ రోజుతో 150 కోట్ల మార్క్ ని క్రాస్ చేయబోతోంది. మాస్ సర్క్యూట్‌లలో ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉండటంతో.. దీని ముందు 'ఎటాక్' నిలబడలేకపోయింది. మెట్రో నగరాల్లో కూడా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం ప్రభావం చూపలేకపోయింది.
తెలుగు సినిమాల్లో నటించనంటూ జాన్ అబ్రహాం సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ లో 'ఎటాక్' సినిమా చూడటానికి ఆసక్తి కనబరచడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'నేనొక హిందీ యాక్టర్ ని.. తెలుగు లేదా మరో ప్రాంతీయ భాషా చిత్రంలో నేనెప్పటికీ నటించను' అని ఇటీవల జాన్ వ్యాఖ్యానించారు.
నటుడికి కళకు భాష - ప్రాంతంలో సంబంధం లేదంటుంటే.. జాన్ అబ్రహాం మాత్రం ప్రాంతీయ సినిమాలను తక్కువ చేసి మాట్లాడటం పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన నటించిన 'ఎటాక్' సినిమాకు ప్రేక్షకులు దూరంగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇకపోతే RRR సినిమా వల్ల 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా నెమ్మదించింది. ఇప్పుడు 'ఎటాక్' మూవీ శనివారం మరియు ఆదివారం బాక్సాఫీస్ వద్ద గౌరవప్రదమైన వసూళ్లతో ఊపందుకోకపోతే.. ట్రిపుల్ ఆర్ దెబ్బకు కుదేలవడం ఖాయంగా కనిపిస్తోంది.
'ఎటాక్' & 'మొర్బియస్' వంటి రెండు కొత్త సినిమాలు మార్కెట్ ను ఆక్రమించినప్పటికీ.. RRR సినిమా ప్రేక్షకుల మొదటి ఎంపికగా మిగిలిపోయిందనేది నిన్నటి వసూళ్లను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. సెకండ్ వీక్ లో శని మరియు ఆదివారాల్లో భారీ వృద్ధిని అంచనా వేయొచ్చు. రాబోయే రోజుల్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.