Begin typing your search above and press return to search.
ఎటాక్ ట్రైలర్: దేశం కోసం సూపర్ సోల్జర్ గా మారిన జాన్..!
By: Tupaki Desk | 22 March 2022 10:33 AM GMTబాలీవుడ్ హీరో జాన్ అబ్రహం - రకుల్ ప్రీత్ సింగ్ - జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పెషల్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఎటాక్''. లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.
కరోనా పాండమిక్ నేపథ్యంలో వవాయిదా పడుతూ వస్తున్న పార్ట్-1 చిత్రాన్ని.. 2022 ఏప్రిల్ 1న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన 'ఎటాక్' టీజర్ - ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ రెండో ట్రైలర్ ను ఆవిష్కరించారు.
ఇది సైన్స్ ఫిక్షన్ యాంగిల్ లో సాగే హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. జాన్ అబ్రహాం ఇందులో అసాధారణ పవర్స్ ఉన్న సూపర్ సోల్జర్ గా కనిపిస్తున్నారు. అతని ప్రేయసిగా ఎయిర్ హోస్టెస్ పాత్రలో జాక్వెలిన్ కనిపించింది.
రకుల్ ప్రీత్ ఒక సైంటిస్ట్ గా నటించగా.. ప్రకాష్ రాజ్ - రత్న పాఠక్ షా కీలక పాత్రలు పోషించారు. భవిష్యత్ లో ఆధునిక టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకొని యుద్ధాలు ఎలా జరుగుతాయి? వాటిని ఎదుర్కోడానికి ఎలా సిద్ధపడాలనే హాలీవుడ్ తరహా కాన్సెప్ట్ తో ''ఎటాక్'' తెరకెక్కినట్లు తెలుస్తోంది.
ఆధునిక టెక్నాలజీనలతో దాడి చేసే తీవ్రవాద దాడులను ఎదుర్కోవడానికి భారతదేశం స్వంత కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) గల సూపర్ సైనికుడిగా జాన్ అబ్రహంను తయారు చేస్తుంది.
అతను దేశానికి సేవ చేయడం కోసం తనకు ప్రియమైన వారిని, తన జీవితాన్ని పణంగా పెట్టి ఎలా పోరాడాడు? అతను ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు? అనేది ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో చూడబోతున్నాం.
''ఎటాక్'' చిత్రాన్ని జెఎ ఎంటర్టైన్మెంట్స్ - పెన్ స్టూడియోస్ - అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై జాన్ అబ్రహాం - జయంతి లాల్ గడ - అజయ్ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి జాన్ అబ్రహం స్వయంగా కథ అందించడం విశేషం.
శాశ్వత్ సచ్ దేవ్ సంగీతం సమకూర్చగా.. విల్ హంఫ్రిస్ - P.S.వినోద్ - సౌమిక్ ముఖర్జీ సినిమాటోగ్రఫీ అందించారు. సమ్మర్ సీజన్ లో రాబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.