Begin typing your search above and press return to search.
ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణపై దాడికి యత్నం.. కారణమిదే?
By: Tupaki Desk | 19 Feb 2022 11:31 AM GMTటాలీవుడ్ లో కలకలం చెలరేగింది. ప్రముఖ సినీ రచయితపై దాడి సంచలనమైంది. టాలీవుడ్ లో సినీ రచయితగా పేరు సంపాదించుకున్న చిన్నికృష్ణపై కొందరు రియల్టర్లు దాడికి ప్రయత్నించారు. దీనికి ఒక భూమి వివాదమే కారణమని తెలుస్తోంది.
హైదరాబాద్ శివారు శంకర్ పల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని తన స్థలాన్ని కొందరు ఆక్రమించుకోవడంతో చిన్నికృష్ణ హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానిక రియల్టర్లు చిన్నికృష్ణపై దాడికి ప్రయత్నించారు. పరుష పదజాలంతో దూషించారు. ఈఘటనపై శంకర్ పల్లి పీఎస్ లో చిన్నికృష్ణ ఫిర్యాదు చేశారు.
కరోనాతో ఇబ్బంది పడుతున్న తనను ఇంట్లోకి చొచ్చుకొచ్చి బెదిరించారని చిన్నికృష్ణ చెప్పారు. స్థానిక గ్రామపంచాయితీ వారు.. తన స్థలానికి క్లియర్ పిచ్చర్ ఇఛ్చారని.. అయినప్పటికీ కావాలనే వివాదం చేస్తున్నారని ఆరోపించారు.
కోర్టులను కూడా అగౌరపరిచేలా మాట్లాడుతున్నారని చిన్నికృష్ణ ఆరోపించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాడి విషయం తెలియగానే పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు చిన్నికృష్ణకు ఫోన్ చేసి ఆరాతీశారు.
టాలీవుడ్ లోనే కాదు.. రాజకీయంగానూ చిన్నికృష్ణ యాక్టివ్ గానే ఉన్నారు. అప్పట్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన వైసీపీ ప్రచార సభలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చిన్నికృష్ణ తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక కూడా చిన్నికృష్ణ అసలు వైసీపీతో టచ్ లో లేకుండా పోయారు. ఆయనకు ఏ పదవి దక్కలేదు.