Begin typing your search above and press return to search.

ప‌బ్లిక్ కి `రిప‌బ్లిక్`ని ఎక్కించే ప్ర‌య‌త్నం..!

By:  Tupaki Desk   |   24 Nov 2021 8:47 AM GMT
ప‌బ్లిక్ కి `రిప‌బ్లిక్`ని ఎక్కించే ప్ర‌య‌త్నం..!
X
మెగా మేన‌ల్లుడు సాయితేజ్ క‌థానాయ‌కుడిగా దేవ‌క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `రిప‌బ్లిక్` థియేట‌ర్లో రిలీజ్ అయి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి దేవ‌క‌ట్టా మార్క్ చిత్రమిద‌న్న టాక్ వ‌చ్చింది. క‌మ‌ర్శియ‌ల్ గా పెద్ద స‌క్సెస్ కాలేదుగానీ ప్ర‌జ‌ల్లో అవేర్ నెస్ తీసుకొచ్చే చిత్రంగా నిలిచింది. భార‌త‌రాజ్యంగం..హ‌క్కులు..ప్రజా వ్య‌వ‌స్థ‌ని సినిమాలో చ‌క్క‌గా చూపించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ జీ-5లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. న‌వంబ‌ర్ 26న ఓటీటీ లో రిలీజ్ కానుంది.

ద‌ర్శ‌కుడే స్వ‌యంగా ఈ రిలీజ్ కోసం ప్ర‌చారం సాగిస్తున్నారు. డైరెక్టర్ దేవాక‌ట్టా కామెంట‌రీతో రిలీజ్ అవ్వ‌డం విశేషం. సాధార‌ణంగా ప్రేక్ష‌కులు సినిమా చూస్తారు. సినిమాలో స‌న్నివేశాల గురించి విమ‌ర్శ‌కులు విశ్లేషిస్తారు. అయితే తాను ఏ కోణంలో స‌ద‌రు స‌న్నివేశం..సినిమా తీసాన‌న్న‌ది ద‌ర్శ‌కుడి కామెంట‌రీతో సినిమా చూపిస్తే? అటు వంటి ప్ర‌య‌త్నానికి ద‌ర్శ‌కుడు దేవ్ కట్టా శ్రీకారం చుట్టారు. సినిమాకి ప‌నిచేసిన ఎడిట‌ర్ ప్ర‌వీణ్ కె.ఎల్..రైట‌ర్ కిర‌ణ్..క్రియేటివ్ నిర్మాత స‌తీష్ బీకేఆర్ ముగ్గురితో రిప‌బ్లిక్ విజువల్ టైమ్ లైన్ గురించి దేవ్ కట్టా డిస్కస్ చేశారు.

నేరుగా డైరెక్ట‌ర్ కామెంట‌రీతో సినిమా చూడాల‌ని కోరుకునే ప్రేక్ష‌కులు ఆ ఆప్ష‌న్ సెల‌క్ట్ చేసుకోవ‌చ్చు. లేదంటే సాధార‌ణంగానైనా సినిమాని చూసుకునే వెసులుబాటుని జీ-5 క‌ల్పిస్తుంది. సినిమాని ఓటీటీలోపైనా క‌మ‌ర్శియ‌ల్ గా స‌క్సెస్ చేయాల‌న్న కోణంలో టీమ్ ఇలా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. కంటెంట్ బేస్డ్ చిత్రాల‌కు ఓటీటీలోనే మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ నేప‌థ్యంలో `రిప‌బ్లిక్` కి ఓటీటీ రిలీజ్ ని పాజిటివ్ వైబ్ గా చెప్పొచ్చు. అలాగే ఇటీవ‌లి కాలంలో ఓటీటీ రిలీజ్ లు కొన్ని సినిమాల‌కు...హీరోల‌కు సెంటిమెంట్ గాను మారిపోయాయి. మ‌రి రిప‌బ్లిక్ ఎలాంటి ఫీడ్ బ్యాక్ తెస్తుందో చూడాలి. ప‌బ్లిక్ కి అధికారులు నాయ‌కుల‌కు ఇలాంటి సినిమాల్ని ఎంత‌గా ఎక్కిస్తే అంత‌గా మార‌తారేమో చూడాలి.