Begin typing your search above and press return to search.
బాహుబలే కావాలి.. ఇంకేమీ వద్దు
By: Tupaki Desk | 19 April 2017 5:37 AM GMTటాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడి చాలా రోజులైపోతోంది. ‘కాటమరాయుడు’ తర్వాత ఆ స్థాయిలో సందడి లేదు. ఆ సినిమా కూడా వీకెండ్ వరకే జోరు చూపించింది. ఆ తర్వాత చల్లబడిపోయింది. తర్వాతి వారం వచ్చిన ‘గురు’ మంచి టాకే తెచ్చుకుంది కానీ.. వసూళ్లు మరీ గొప్పగా ఏమీ లేవు. క్లాస్ సెంటర్లలో బాగానే ఆడిన ఈ చిత్రం.. బి-సి సెంటర్లలో అంతగా ప్రభావం చూపలేకపోయింది.
ఈ సినిమా బడ్జెట్ లెక్కల్లో చూస్తే మంచి వసూళ్లే వచ్చాయి కానీ.. మరీ థియేటర్లయితే కళకళలాడిపోలేదు. దాంతో పాటుగా వచ్చిన ‘రోగ్’ వచ్చింది.. వెళ్లింది కూడా తెలియదు. ఇక ఆ తర్వాతి వారం వచ్చిన ‘చెలియా’ అడ్రస్ లేకుండా పోయింది. పోయిన వారం వచ్చిన ‘మిస్టర్’ బోల్తా కొట్టేసింది. ‘శివలింగ’ మాస్ ఏరియాల్లో పర్వాలేదనిపిస్తోంది.
వేసవి సెలవులు మొదలైపోవడంతో జనాలు సినిమాల కోసం ఆవురావురుమని ఉన్నారు. అయినా వాళ్లను థియేటర్లకు బాగా ఆకర్షించే సినిమాలు ఇప్పుడు థియేటర్లలో లేవు. వచ్చే వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టంతా ‘బాహుబలి: ది కంక్లూజన్’ మీదే ఉంది. దాని కోసమే ప్రేక్షకుల ఎదురు చూపులంతా. మధ్యలో ఇంకే సినిమానూ జనాలు పట్టించుకునేలా లేరు. ఆ సినిమా వస్తే పొలోమని థియేటర్లకు వెళ్లిపోవడమే. కనీసం రెండు మూడు వారాల పాటు ‘బాహుబలి’ హిస్టీరియా కొనసాగే అవకాశముంది. అప్పటి వరకు థియేటర్ల వెల వెల తప్పేలా లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/