Begin typing your search above and press return to search.
ఇంగ్లీష్ సినిమాకు ఇంత ఎమోషనా ?
By: Tupaki Desk | 26 April 2019 9:55 AM GMTఆకాశమే హద్దుగా పెట్టుకున్న అంచనాలను మోసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నడూ ఎరుగని భారీ విడుదలను దక్కించుకున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రకంపనలు మొదలైపోయాయి. సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో రేపు ఎల్లుండి టికెట్లు కొన్నవాళ్ళను హీరోలుగా చూసే పరిస్థితి నెలకొంది. ఇక ప్రతి శుక్రవారం ప్రహసనంగా మారే ప్రసాద్ ఐమ్యాక్స్ పబ్లిక్ టాక్ ఈసారి ట్రెండ్ కు భిన్నంగా ఎమోషనల్ గా సాగడం విశేషం.
చూసి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు సినిమాను ఓ రేంజ్ లో పొగడ్తలతో ముంచెత్తడం ఏ మైకు దగ్గర చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది. కొందరు ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకోవడం ఒక్కటే తక్కువ అనేలా రియాక్ట్ కావడం మీడియా ప్రతినిధులను సైతం ఆశ్చర్యపరిచింది. కర్చీఫులు తడిపే తెలుగు సినిమాలకు సైతం ఇలాంటి పబ్లిక్ టాక్ చూడలేదని పరిశీలకులు అంటున్నారు.
మొత్తానికి అంచనాలు నిలబెట్టుకునే ఎండ్ గేమ్ వసూళ్ల ఊచకోతకు తెగబడటం ఖాయంగా కనిపిస్తోంది. థియేటర్లో రెస్పాన్స్ చూస్తే ఈలలు కేకలు గోల ఏదో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి హీరోల సినిమాలకు వచ్చే మాస్ హిస్టీరియా ఇక్కడే కనిపిస్తోంది. పైగా సూపర్ హీరోస్ త్యాగానికి సంబంధించిన సన్నివేశాలలో కల్ట్ ఫ్యాన్స్ ఏకంగా హాల్లోనే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఈ స్థాయి స్పందన భవిష్యత్తులో చూడటం డౌటే అని చెప్పొచ్చు. ఇదే ఆఖరి భాగం కావడం మర్వెల్ సంస్థకు ఇందరు సూపర్ హీరోలను ఇంకో సినిమాలో చూపించే ఉద్దేశం లేకపోవడం కూడా అభిమానులు భావోద్వేగాలకు గురి కావడాన్ని కారణంగా చెప్పొచ్చు. ఇదంతా చూసాక వన్ మోర్ ఫైనల్ గేమ్ అంటూ అవెంజర్స్ ఇంకో పార్ట్ తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు