Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ కు ఊహించని రీతిలో ప్రేక్షకుల నుంచి షాకులు?
By: Tupaki Desk | 28 July 2019 4:25 AM GMTబిగ్ బాస్ షోకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈసారి తానే రంగంలోకి దిగుతున్నట్లుగా హుషారు పుట్టించేలా కింగ్ నాగార్జున చేస్తున్న ప్రోమోలతో ఆసక్తి వ్యక్తమైనా.. హౌస్ మేట్స్ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. గత రెండు సీజన్లలో తాము అభిమానించే హౌస్ మేట్స్ కు పెద్ద ఎత్తున ఓట్లు వేసిన ప్రేక్షకులు ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు.
గత రెండు ఎపిసోడ్స్ కు భిన్నంగా ఈసారి బిగ్ బాస్ కు ప్రేక్షకులు రివర్స్ గేర్ లో భారీ షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు వచ్చిన ఓట్లు భారీగా తగ్గిపోయినట్లుగా తెలుస్తోంది. గతంలో లక్షల్లో వచ్చే ఓట్లు.. ఈసారి మాత్రం వేలల్లో మాత్రమే వచ్చాయని.. ఓట్లు వేసే విషయంలో ఎందుకింత అనాసక్తి వ్యక్తమవుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది.
అయితే.. ఇదేమీ పెద్ద విషయం కాదన్న మాట వినిపిస్తోంది. గతంలో తమకు నచ్చిన వారికి అదే పనిగా.. ఎడాపెడా ఓట్లు వేసే అవకాశం ఉండేదని.. కానీ ఈసారి మాత్రం ఓట్లు వేసే విషయంలో పెట్టిన పరిమితులు కూడా తక్కువ ఓట్లు పోల్ కావటానికి కారణంగా చెబుతున్నారు. గతానికి భిన్నంగా ఈసారి హాట్ స్టార్ ద్వారా పదేసి ఓట్లు.. మిస్డ్ కాల్ ద్వారా 40 ఓట్లు వేసే అవకాశం మాత్రమే ఒక్కొక్కరికి ఇచ్చారు. దీంతో.. ఓట్లు బాగా తగ్గినట్లుగా చెబుతున్నారు.
షో మీద ప్రజల్లో ఉండే క్రేజ్ ఎంతన్న విషయాన్ని లెక్క తేల్చేందుకు ప్రోగ్రామ్ టీఆర్పీ రేటింగ్ నే ప్రామాణికంగా తీసుకుంటారు.కాకుంటే.. ప్రేక్షకుల్లో మరింత ఉత్సుకత రేపటానికి.. అరే.. ఇంతమంది ఓట్లు వేశారా? అన్న భావన కలిగించేందుకు పనికి వస్తుందన్న మాట ఉంది. ఇదంతా ఎలా ఉన్నా.. విన్నంతనే అరే.. ఇంత తక్కువ ఓట్లా? అన్న భావన కలిగేలా ఈసారి లెక్కలు ఉంటాయన్న మాట వినిపిస్తోంది. షాకింగ్ టాస్క్ లతో షాకులిచ్చే బిగ్ బాస్ కు.. ప్రేక్షకులు ఓట్లు వేసే విషయంలో మాత్రం ఊహించని రీతిలో షాకిచ్చారని చెప్పక తప్పదు.