Begin typing your search above and press return to search.
హోరాహోరీ.. పైరసీలో అయినా చూస్తారా?
By: Tupaki Desk | 13 Sep 2015 5:30 PM GMTఅనువుగాని చోట అధికుడన్న మాట అవనద్దునంటరన్న.. అని ఓ సినిమా పాట. నిజమే మరి.. కాలం కలిసిరానపుడు కొంచెం సైలెంటుగా ఉండటం బెటర్. కానీ డైరెక్టర్ తేజ మాత్రం అలా ఎప్పుడూ తగ్గింది లేదు. అరడజనుకు పైగా వరుస ఫ్లాపులిచ్చినా ఆయన నోటి దురుసు మాత్రం తగ్గించుకోలేదు. తాను ఒకే తరహా సినిమాలు తీస్తూ వేరేవాళ్లను తిట్టిపోశాడు. ఈసారేమైనా మారాడేమో అనుకుంటే.. మళ్లీ ‘జయం’ జిరాక్స్ కాపీ చూపించి.. జనాలకు చిర్రెత్తుకొచ్చేలా చేశాడు. ఐతే వేరే వాళ్లను విమర్శించడమే కాదు.. తన సినిమా విషయంలో ఓ చిత్రమైన సవాలు విసిరి అడ్డంగా దొరికిపోయాడు తేజ.
హోరాహోరీ ప్రమోషన్స్ లో భాగంగా తన సినిమా నచ్చితేనే థియేటరుకు వెళ్లి చూడాలని.. లేకుంటే పైరసీలో చూసుకోమని సెలవిచ్చాడు తేజ. ఇప్పుడు ‘హోరాహోరీ’కి వస్తున్న టాక్ ఏంటో తెలిసిందే. ఏ ప్రేక్షకుడు కూడా ఓ మంచి మాట మాట్లాడట్లేదు ఈ సినిమా చూసి. మొత్తానికి సినిమా జనాలకు నచ్చలేదని తేలిపోయింది. ఐతే జనాలు పైరసీ చూసుకోవచ్చన్నమాట. సలహా ఇచ్చింది తేజానే కాబట్టి.. ఆ పైరసీ ఏర్పాటు కూడా అతనే చేసేస్తే బెటరేమో.
కానీ ఇక్కడ మళ్లీ ఓ సందేహం. జనాలు కనీసం పైరసీలో అయినా ‘హోరాహోరీ’ చూడ్డానికి రెడీగా ఉన్నారా అని. ప్రేక్షకులు ఈ మధ్య మరీ తెలివి మీరిపోయారు. బాలేని సినిమాను పైరసీలో చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. పర్వాలేదంటేనే పైరసీలో చూస్తున్నారు. చాలా బాగుందంటేనే థియేటరుకు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘హోరాహోరీ’కి వచ్చిన టాక్ ప్రకారం చూస్తే జనాలు పైరసీలో చూడ్డానికైనా ఇష్టపడతారా అనేది సందేహమే. పైగా క్రేజున్న సినిమాల్ని పైరసీ చేస్తే డిమాండ్ ఉంటుంది కానీ.. ఇంత నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాకు పైరసీ దొరకడమూ కష్టమే.