Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ బెస్ట్ అన్నారు.. వాళ్ళు కాదన్నారు!
By: Tupaki Desk | 5 Feb 2020 1:30 PM GMTస్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా మలిచారు. ఈ సినిమా త్రివిక్రమ్ కెరీర్ లో కూడా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. గురూజీ ఫామ్ లోకి వచ్చారని అభిమానులు కూడా సంతోషపడ్డారు. ఈ సినిమా విజయం పట్ల త్రివిక్రమ్ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ విషయం గురూజీ మాటల్లోనే తెలుస్తోంది. ఈ మధ్య 'అల వైకుంఠపురములో' ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమాను తన కెరీర్లో బెస్ట్ ఫిలింగా అభివర్ణించారు.
అయితే గురూజీ వ్యాఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఎక్కువమంది 'అత్తారింటికి దారేది' సినిమాను త్రివిక్రమ్ బెస్ట్ ఫిలిం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో 'అతడు' సినిమాను గురూజీ బెస్ట్ ఫిలిం అని అంటారు. ఈ విషయంపై మేము ఒక పోల్ నిర్వహించాము. "త్రివిక్రమ్ వ్యాఖ్యానించిన విధంగా అల వైకుంఠపురములో ఆయన కెరీర్ ఉత్తమ చిత్రమా?" అనే ప్రశ్నకు మొత్తం 27982 ఓట్లు పోలయ్యాయి. అందులో 'అవును' అంటూ 5110 మంది ఓటు వేయగా.. 'కాదు' అంటూ 21852 మంది ఓటేశారు. ఇక 'ఏమో తెలియదు' అని 1020 మంది చెప్పారు. ఇదే పోల్ ను ఓట్ల శాతం ప్రకారం చూస్తే 78.09% ప్రేక్షకులు గురూజీ వ్యాఖ్యతో ఏకీభవించలేదు. జస్ట్ 18.26% ప్రేక్షకులు మాత్రం త్రివిక్రమ్ చెప్పిన విషయం అంగీకరించారు. ఇక 3.65% పాఠకులు ఏమో తెలియదంటూ తమ అమూల్యమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.
దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థం అవుతున్న విషయం ఏంటంటే 'అల వైకుంఠపురములో' సినిమాను త్రివిక్రమ్ కెరీర్ లో 'ది బెస్ట్ ఫిలిం' కాదని దాదాపు 80% మంది అభిప్రాయపడుతున్నారు. ఈలెక్కన 'అల వైకుంఠపురములో' సినిమాకు త్రివిక్రమ్ కెరీర్లో టాప్ 3 లో చోటిస్తారేమో కానీ నెంబర్ 1 అంటే మాత్రం ఎక్కువమంది ఒప్పుకోవడం లేదు. మరి గురూజీ ఈ వాస్తవాన్ని గమనిస్తారో లేదో. గురూజీ మాటల్లోనే ఈ విషయం చెప్పుకుంటే "దేనికైనా స్థానం ఇవ్వగలం కానీ స్థాయిని ఇవ్వలేం".