Begin typing your search above and press return to search.

పొన్నియిన్ సెల్వ‌న్ పై ఆడియన్స్‌ మాటేంటీ?

By:  Tupaki Desk   |   2 Oct 2022 11:30 PM GMT
పొన్నియిన్ సెల్వ‌న్ పై ఆడియన్స్‌ మాటేంటీ?
X
మ‌ణిర‌ర్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వ‌న్` ఎట్ట‌కేల‌కు సెప్టెంబ‌ర్ 30న భారీ స్థాయిలో ఐదు భాష‌ల్లో విడుద‌లైంది. చియాన్ విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, కార్తి, త్రిష కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ త‌మిళం మిన‌హా ఇత‌ర భాష‌ల్లో పెద్ద‌గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాపై ఆడియ‌న్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా భిన్నాభిప్రాయాల్ని వ్య‌క్తం చేశారు. సినిమా బాగుంద‌ని కొంత మంది అంటే మ‌రి కొంత మంది అస‌లు అర్థం కాలేద‌ని, చాలా క‌న్ఫ్యూజింగ్ గా వుంద‌ని కొంత మంది కామెంట్ లు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు వాయిస్ ఓవ‌ర్ అందించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ వాయిస్ ఓవ‌ర్ కూడా ప‌ర్ ఫెక్ట్ గా లేద‌ని, ఏం చెప్పారో నాకు అర్థం కాలేద‌ని, ప్రేక్ష‌కుల‌ని సిద్ధం చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని.. పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేస్తే గంద‌గోళం వుండేది కాద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. మ‌రో నెటిజ‌న్ ఏకంగా క‌థ‌, క‌థ‌నాల‌పై ఘాటుగా స్పందించాడు. నేను న‌వ‌ల చ‌దివాన‌ని, అయితే నేను ఆశించిన స్థాయిలో సినిమాని ఉన్న‌తంగా తెర‌పైకి తీసుకురాలేద‌ని పెద‌వి విరిచాడు.

అంతే కాకుండా ఎవ‌రూ ఊహించ‌ని న‌టుడిని టైటిల్ పాత్ర‌కు మ‌ణిర‌త్నం ఎన్నుకోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టాడు. త‌మిళ రాచ‌రిక చ‌రిత్ర‌లో పొన్నియిన్ సెల్వ‌న్ రాజ రాజ చోళ‌ని అగ్ర రాజుగా ఊహించుకున్నాన‌ని అలాంటి పాత్ర కు అగ్ర న‌డుడిని తీసుకుంటార‌నుకుంటే జ‌యం ర‌నిని తీసుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, ఈ విష‌యంలో తాను చాలా డిజప్పాయింట్ కి గుర‌య్యాన‌ని మ‌ధురైకి చెందిన నెటిజ‌న్ వాపోయాడు.

మ‌రో నెటిజ‌న్ పొన్నియిన్ సెల్వ‌న్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. మ‌ణిర‌త్నం శైలి సినిమా ఇదిని, ప్ర‌తీ బిట్ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని, అయితే ఇలాంటి చారిత్ర‌క సినిమాకు బిలో యావ‌రేజ్ రివ్యూలు రావ‌డం త‌న‌ని బాధించింద‌ని, మ‌ణిర‌త్నం ప్ర‌శంస‌ల‌కు అర్హుడ‌ని, పొన్నియిన్ సెల్వ‌న్ ఓ చ‌రిత్ర ఆ చ‌రిత్ర‌ని ద‌ర్శ‌కుడు ప‌రిమితుల‌కు లోబ‌డే చేస్తాడ‌ని, మ‌ణిర‌త్నం అదే చేశాడ‌ని, ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ కు అర్హ‌మైన‌ద‌ని కోనియాడాడు.

ఇక మ‌రో నెటిజ‌న్ సినిమా అర్థం కాలేద‌న్న వారిపై ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. సినిమా అర్థం కాలేద‌న్న వారి ప‌ట్ల నాకు జాలి వుంది. మ‌ణిర‌త్నం ప్ర‌తిభ‌ను చాలా మంది త‌క్క‌వ‌గా అంచ‌నా వేస్తున్నార‌ని, అలాంటి వారు వారి జ్ఞానాన్ని ఒక‌సారి ప‌రిశీలించుకుంటే మంచిదంటూ చుర‌క‌లు అంటించాడు. ఇలా ప్ర‌తీ ఒక్క‌రు ఒక్కో కోణంలో `పొన్నియిన్ సెల్వ‌న్ 1`పై సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ త‌మ అభిప్రాయాల్ని పంచుకున్నారు.