Begin typing your search above and press return to search.
కామెంట్: నాలుగు సినిమాలు చూసేస్తారు
By: Tupaki Desk | 5 Jan 2016 5:30 PM GMTఇప్పటికే సంక్రాంతి సందర్భంగా ఎవరొస్తున్నారు ఎవరు రావట్లేదు అని ఆరాతీస్తే.. 14న గ్యారంటీ అన్నాడు శర్వానంద్. ఎక్స్ ప్రెస్ రాజాతో దిగిపోతున్నాడట. ఇకపోతే నాగ్ కూడా అంతే. సోగ్గాడే చిన్ని నాయనా అంటూ ఆ సినిమాతో సందడి చేసేస్తా అని చెప్పశాడు. మరి ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో అనేస్తే.. బాలయ్య డిక్టేటర్ కూడా ఎరైవల్ ను కూడా తేల్చేస్తే.. ఓ పనైపోయినట్లే. అయితే ఇక్కడ ఉందీ ఓ ఛమత్కారం. ఇంతకీ ఆడియన్స్ ఈ సినిమాల్లో దేన్ని చూస్తారు?
యాక్చువల్లీ సంక్రాంతికి ఓ నాలుగు సినిమాలు చూసేంత బడ్జెట్.. దాదాపు అందరూ రెడీ చేసుకుంటారు. కాబట్టి నాలుగూ చూసేస్తారని అనుకోవచ్చు. అయితే ఈ నాలుగు సినిమాలకూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ సినిమాల్లో ఏ ఒక్కటీ కూడా మరో దానికి సంబంధించిన జానర్ కాదు. ఛ నిజమా అనకండే. ఫర్ ఎగ్జాంపుల్ నాన్నకు ప్రేమతో తీసుకుంటే.. అదొక ఎమోషనల్ ఎంటర్ టైనర్. ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు. ఎక్స్ ప్రెస్ రాజా ఒక రొమాంటిక్ కామెడీ. యూత్ ఎగబడతారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో సీనియర్ నాగ్ దెయ్యమంటూ కొత్త ట్రైలర్ లో చెప్పేశారు. సో.. అదొక సస్పెన్స్ ఉన్న సోషియో ఫ్యాంటసీ సినిమా. మిగిలింద మన డిక్టేటర్. మ.. మ.. మ.. మాస్ మసాలా మూవీ ఇది. ఆ విధంగా నాలుగు జానర్లలో వస్తున్న ఈ నాలుగు సినిమాలను చూడటానికి నాలుగు వర్గాల ఆడియన్స్ తప్పకుండా ఉంటారుగా.
కొంతమంది ఎలాగూ నాలుగూ చూసేస్తారు. మరి కొందరు రెండైనా గ్యారెంటీ. కంటెంట్ తో కాస్త ఆకట్టుకుంటే చాలు.. పండక్కి ఈ నాలుగు పుంజులకీ ఫుల్ గిరాకీ. మరో విషయం ఉందండోయ్.. ఐదో పుంజుగా డబ్బింగ్ రాజు విశాల్ కథాకళి సినిమాతో దూసుకొస్తున్నాడు. అదొక యాక్షన్ జానర్ అట. పొరపాటును కిక్కిస్తే ఆ సినిమా కూడా ఆడేస్తే ఆడేయవచ్చు.