Begin typing your search above and press return to search.

మీరు ఓపెన్‌ చేసినా మేము రాము..!

By:  Tupaki Desk   |   10 Aug 2020 2:30 AM GMT
మీరు ఓపెన్‌ చేసినా మేము రాము..!
X
కరోనా కారణంగా ఎన్నో పరిశ్రమలు కుదేళయ్యాయి. వాటిలో సినిమా పరిశ్రమ కూడా ఒకటి అనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా థియేటర్లు దాదాపుగా మూత పడే ఉన్నాయి. కరోనా ప్రభావం కాస్త తక్కువగా ఉన్న చోట థియేటర్లు ఓపెన్‌ అయినా కూడా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 50 శాతం థియేటర్లు గడచిన నాలుగు అయిదు నెలలుగా మూతబడే ఉన్నాయి. ఇండియాలో మార్చి నుండే థియేటర్లలో బొమ్మ పడటం బంద్‌ అయ్యింది. అదుగో ఇదుగో అంటూ థియేటర్ల ఓపెన్‌ గురించి ప్రచారం జరుగుతోంది.

అన్‌ లాక్‌ లో భాగంగా ఆగస్టు 1 నుండి ఇండియాలో థియేటర్లు ఓపెన్‌ కు అనుమతులు వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. కాని ఇంకా కూడా పరిస్థితులు సీరియస్‌ గానే ఉన్న కారణంగా థియేటర్లకు ఇప్పుడే తొందర ఏమీ లేదంటూ కేంద్రం వాటిని లాక్‌ లోనే ఉంచాలని నిర్ణయించింది. సెప్టెంబర్‌ లో మాత్రం ఖచ్చితంగా థియేటర్ల కు ఉన్న లాక్‌ ను డౌన్‌ చేసే అవకాశం క్లీయర్‌ గా కనిపిస్తుంది. అందుకే మల్టీ ప్లెక్స్‌ నుండి చిన్న థియేటర్ల వరకు బొమ్మ వేసేందుకు రెడీ అవుతున్నాయట.

సెప్టెంబర్‌ లో థియేటర్లు ఓపెన్‌ అయితే మీరు చూసేందుకు ఆసక్తి చూపిస్తారా అంటూ చైన్‌ థియేటర్స్‌ ఉన్న ఏషియన్‌ సినిమాస్‌ ట్విట్టర్‌ లో ఒక పోల్‌ పెట్టింది. ఆ పోల్‌ లో కరోనా పోయే వరకు థియేటర్లను ఓపెన్‌ చేయకుంటేనే బెటర్‌ అనే అభిప్రాయంను దాదాపుగా సగం మంది వ్యక్తం చేశారు. మిగిలిన వారిలో కొందరు కొన్ని సినిమాలను విడుదల చేయాలనగా కొందరు మాత్రం రెండు మూడు వారాల పాటు వెయిట్‌ చేసి ప్రారంభిస్తే బాగుంటుందేమో అన్నారు. మరికొందరు మాత్రం వెంటనే థియేటర్లను ఓపెన్‌ చేయాలని కూడా కోరారు. ఎక్కువ శాతం మాత్రం కరోనా పోయే వరకు థియేటర్లకు రాము అనే నిర్ణయాన్ని తెలియజేశారు.

సెప్టెంబర్‌ లో థియేటర్లు ఓపెన్‌ అయినా ఆక్యుపెన్సీ 35 నుండి 50 శాతం వరకు మాత్రమే ఉండే అవకాశం ఉందంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లు ఓపెన్‌ చేస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా ఉంది. ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఇప్పట్లో థియేటర్లు ఓపెన్‌ చేయడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేశారు. కొందరు మాత్రం థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.