Begin typing your search above and press return to search.

ఏంటీ సీన్లు చరణ్.. బుర్రగోక్కుంటున్న ప్రేక్షకులు!

By:  Tupaki Desk   |   12 Jan 2019 5:37 AM GMT
ఏంటీ సీన్లు చరణ్.. బుర్రగోక్కుంటున్న ప్రేక్షకులు!
X
మన సినిమాలల్లో ఓవర్ ది టాప్ హీరోయిజం అనేది ఎప్పటి నుంచో ఉండేది. కానీ అందులోనూ నందమూరి బాలకృష్ణ సినిమాల్లో అది మరీ పీక్స్ లో ఉంటుంది. మాస్ ఆడియన్స్ ను మెప్పించడం పేరిట దర్శకులు అర్థం పర్థం లేని ఎన్నో సీన్లను బాలయ్య సినిమాలలో పెట్టేవారు అప్పటి దర్శకులు. 'పలనాటి బ్రహ్మనాయుడు' లో తొడగొట్టి ట్రైన్ ను వెనక్కు పంపించడం.. 'విజయేంద్ర వర్మ' లో బైకు వేసుకొని నేరుగా ట్రైన్ మీదకు వెళ్ళడం.. 'చెన్నకేశవ రెడ్డి' లో కాలికి పాలిథీన్ కవర్లు కట్టుకుని ప్యారచూట్ లాగా పెద్ద బిల్డింగ్ పై నుండి జంప్ చేయడం.. అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పొతే ఒక పుస్తకం రాయొచ్చు.

ప్రేక్షకుల అభిరుచులు మారిన తరుణంలో వాటిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ దారుణంగా సాగింది. ఇంటర్నెట్ లో మీమ్స్.. ట్రోలింగ్ వీడియోలు వేలకొద్దీ ఉన్నాయి. ఇక బాలయ్య కూడా ఒకసారి ఇలాంటి సీన్లపై ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ అప్పట్లో దర్శకులు చెప్పిన సీన్ ను చెప్పినట్టు చేసేవాడినని తనకు కూడా ఆ సీన్లు ఫన్నీగా అనిపించాయని నవ్వేశారు. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' లో ఇలాంటి సీన్లు రెండు జనాలకు షాక్ కు గురి చేస్తున్నాయి. అన్నయ్యను కాపాడడం కోసం చరణ్ ఎయిర్ పోర్ట్ నుండి మామూలుగా బయటకు రాకుండా అద్దాలు పగలగొట్టుకుని బయటికి దూకుతాడు. ఆ తర్వాత ఒక బ్రిడ్జ్ మీది నుంచి ట్రైన్ మీదికి జంప్ చేసి.. అలానే బీహార్‌ కు వెళ్తాడు. మరో సీన్లో చరణ్ రౌడీల తలలు నరుకుతాడు. అవి గాల్లో ఎగురుతుంటే గద్దలోచ్చి ఆ తలలను ముక్కున కరుచుకొని వెళ్తాయి. ఈ సీన్లు చూసిన ప్రేక్షకులు ఎం చెయ్యాలో అర్థం కాక బుర్ర గోక్కుంటున్నారట. థియేటర్లలో కొంతమంది వీక్ హార్ట్ ఉండేవాళ్ల కు మైండ్ బ్లాంక్ అయ్యి నోటమాటలు రావడం లేదట.

బాలయ్య అంటే సీనియర్ స్టార్.. అయన అప్పట్లో చేశాడంటే ఒకే కానీ ఈ జెనరేషన్ స్టార్ అయిన చరణ్ ఇలాంటి మీనింగ్ లెస్ సీన్లను ఎలా ఒప్పుకున్నాడో అని సాధారణ ప్రేక్షకులకే కాకుండా ఫ్యాన్స్ కు కూడా పిచ్చెక్కుతోందట. ఒకవైపు దర్శకులు తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకుపోతుంటే బోయపాటి లాంటి దర్శకులు అక్కడే ఉంటామంటున్నారు. ఇప్పటికే నెటిజనులు బోయపాటి.. ఏంటీ క్రియేటివిటీ? అంటూ తలలు పట్టుకుంటున్నారు.