Begin typing your search above and press return to search.
సునీల్ అలాంటి పాత్రల జోలికి వెళ్లకపోవడమే మంచిదేమో..!
By: Tupaki Desk | 25 Oct 2020 3:30 AM GMTహాస్యనటుడిగా ఇండస్ట్రీకి వచ్చిన సునీల్.. హీరోగా మారి 'అందాలరాముడు' 'మర్యాదరామన్న' 'పూలరంగడు' వంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా సునీల్ హీరోగా నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో హీరో వేషాలు మాత్రమే చేయాలని అనుకోకుండా మళ్ళీ కమెడియన్ కమ్ సపోర్టింగ్ రోల్స్ లో కంటిన్యూ అవుతున్నాడు. ఈ క్రమంలో 'డిస్కో రాజా' మూవీలో నెగెటివ్ రోల్ లో కూడా నటించాడు. అయితే ఎన్నాళ్ళుగానో సునీల్ ని కమెడియన్ గా హీరోగా చూసిన ప్రేక్షకులు విలన్ గా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో హాస్యనటుడు సుహాస్ హీరోగా పరిచయం అవుతున్న 'కలర్ ఫోటో' సినిమాలో పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా నటించాడు. అయితే సునీల్ విలనిజం పై ఆడియన్స్ నుంచి విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన 'కలర్ ఫోటో' సినిమా 'ఆహా' లో విడుదలైంది. విలన్ గా తనని ప్రూవ్ చేసుకోవడానికి సునీల్ చాలా కష్టపడినప్పటికీ.. ప్రేక్షకుల్లో మాత్రం తెరపై ఒక భీకరమైన విలన్ ని చూస్తున్నామనే భావన ఎక్కడా కనిపించలేదని.. విలన్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. నటన పరంగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ.. అక్కడక్కడా సునీల్ ఓవర్ పర్ఫార్మెన్స్ తో సినిమాకి ఉన్న మైనస్సుల్లో ఒకటైయ్యాడని అంటున్నారు. అయితే ఇప్పుడు సునీల్ మళ్ళీ కామెడీ రోల్స్ చేయడానికి ప్రేక్షకులు ఆల్రెడీ అతనిలో ఉన్న ఎక్స్ ట్రీమ్ కామెడీ అంతా చూసేశారు. అందుకే సునీల్ విలనీ వేషాలు పక్కనపెట్టి, హీరోగానే కొనసాగుతూ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తే బాగుంటుందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా సునీల్ 'వేదాంతం రాఘవయ్య' అనే సినిమాలో హీరోగా చేయనున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ హరీష్ శంకర్ స్టోరీని అందించడంతో పాటు చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ రామ్ ఆచంట - గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.