Begin typing your search above and press return to search.

ట్రిపుల్ ఆర్ పై ఆడియ‌న్స్ కంప్లైంట్

By:  Tupaki Desk   |   29 March 2022 11:30 PM GMT
ట్రిపుల్ ఆర్ పై ఆడియ‌న్స్ కంప్లైంట్
X
యావ‌త్ వ‌ర‌ల్డ్ వైడ్ గా వున్న తెలుగు ప్రేక్ష‌కులు ట్రిపుల్ ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని దాదాపు మూడున్న‌రేళ్లుగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపుల‌కు తెర‌దించుతూ ఎట్ట‌కేల‌కు ట్రిపుల్ ఆర్ మార్చి 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. అత్యంత భారీ స్థాయిలో రికార్డు స్థాయి థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ప్రీమియ‌ర్ షోల నుంచే రికార్డుల మోత మోగిస్తున్న ట్రిపుల్ ఆర్ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచి నార్ ఇండియా స్థాయి బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది.

రిలీజ్ అయిన ప్ర‌తీ చోటి నుంచి ఈమూవీకి ఇదే టాక్ యునానిమ‌స్ గా విన‌పించింది. దీంతో ట్రిపుల్ ఆర్ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మోగించ‌డం మొద‌లుపెట్టింది. కేవ‌లం రెండు రోజుల్లోనే బాహుబ‌లి రికార్డుని అధిగ మించి స‌రికొత్త రికార్డుల‌ని తిర‌గ‌రాస్తోంది. ద‌క్షిణాదితో పాటు ఈ మూవీకి ఉత్త‌రాదిలోనూ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ మూవీ విడుద‌లై ఇప్ప‌టికి నాలుగు రోజుల‌వుతోంది. సినిమా విడుద‌లైన మూడు రోజుల్లోనూ ట్రిపుల్ ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా 500 కోట్లు వ‌సూలు చేసి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది.

అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ఈ మూవీపై లోక‌ల్ రూర‌ల్ ప్రేక్ష‌కులు ఓ కంప్లైంట్ ని చేశారు. ఇది ఇప్పుడు వైర‌ల్ గా మారి ప్ర‌తీ ఒక్క‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ట్రిపుల్ ఆర్ ని 1920 ప్రీ ఇండిపెండెంట్ ఎరా నేప‌థ్యంలో సాగే సినిమాగా తెర‌కెక్కించారు.

బ్రిటీష్ కాలం నాటి స్వాతంత్య్ర పోరాటం నేప‌థ్యంలో రూపొందిన సినిమా కావ‌డంతో అత్య‌థిక శాతం ఫారిన్ న‌టులు న‌టించారు. అంతే కాకుండా సినిమాలో వీరి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల్లో ఎక్కువ భాగం ఇంగ్లీష్ లోనే వారి సంభాష‌ణ‌లు సాగుతున్నాయి.

వీటిపైనే ఇప్పుడు ప్రేక్ష‌కులు కంప్లైంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కొన్ని స‌న్నివేశాల్లో రానా, న‌వ‌దీప్ ల‌తో కొంత మంది ఫారిన్ న‌టులు చెప్పే డైలాగ్ ల‌కు తెలుగు అనువాదాలు అందించారు. మ‌రి కొన్ని చోట్ల వ‌దిలేశారు. ఎన్టీఆర్ ని క‌ట్టేసి కొడ‌తున్న సంద‌ర్భాల్లో అలీస‌న్ డూడీకి రే స్టీవెన్ స‌న్ మ‌ధ్య వ‌చ్చే డైలాగ్ లకు తెలుగు అనువాదాన్ని జ‌క్క‌న్న మ‌రిచిపోయారు. అంతే కాకుండా చాలా స‌న్నివేశాల్లో తెలుగు అనువాదం మిస్స‌యింది. అవి అర్థం కావ‌డం లేద‌ని, అంతే కాకుండా మిగ‌తా కీల‌క ఘ‌ట్టాల్లోనూ తెలుగు అనువాదం మ‌ర్చిపోయార‌ని గ్రామీణ ప్రాంతాల ప్రేక్ష‌కులు ట్రిపుల్ ఆర్ టీమ్ కు కంప్లైంట్ చేస్తున్నార‌ట‌.

కొన్ని స‌న్నివేశాల్లో ఏం జ‌రుగుతోందో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని, క‌నీసం ఆ స‌న్నివేశాల్లో అయినా తెలుగు టైటిల్స్ వేయండ‌ని అంటున్నారట‌. అయితే గ్రామీణ ప్రేక్ష‌కులు చేస్తున్న ఈ కంప్లైంట్ ని ట్రిపుల్ ఆర్ టీమ్ సీరియ‌స్ గా తీసుకుని తెలుగు స‌బ్ టైటిల్స్ ని ఏర్పాటు చేస్తుందా? లేక ఇప్ప‌డు ప్రింట్స్ ని మార్చ‌డం పెద్ద రిస్క్ అని వ‌దిలేస్తుందా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.