Begin typing your search above and press return to search.
మూడు సినిమాల్లోనూ అదే ప్రమోషన్!!
By: Tupaki Desk | 14 Aug 2017 7:28 AM GMTఇప్పుడొచ్చిన మూడు కొత్త సినిమాల గురించి మాట్లాడుకుంటే.. ముఖ్యంగా ఆ సినిమాల్లోని లొకేషన్లే టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాయ్. మనం ఆల్రెడీ చెప్పినట్లు బోయపాటి శ్రీను 'జయ జానకి నాయక' సినిమాలో చూపించిన హంసలదీవి ఎపిసోడ్ కారణంగా.. గూగుల్లో ఆ దీవి గురించి.. విజయవాడ నుండి అక్కడకు ఎలా చేరుకోవాలి అనే విషయం గురించీ తెగ సెర్చింగ్ చేస్తున్నారు జనాలు. అలాగే మిగిలిన రెండు సినిమాల్లో కూడా ఇదే తరహా లొకేషన్లు ఉన్నాయి.
నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా అండ్ కాజల్ మధ్యన గుడిలో చోటుచేసుకునే సన్నివేశాలు చూసి.. అసలు ఈ గుళ్ళు ఎక్కడున్నాయ్ అంటూ ఆరా తీయడం మొదలెట్టారు జనాలు. ముఖ్యంగా యాగాని.. బనగానపల్లెలో ఉన్న టెంపుల్స్ లో షూటింగ్ జరిగిందని తెలుసుకుని.. వాటికి వెళ్లే రూట్ మ్యాప్ గురించి కనుక్కుంటున్నారట. ఇక నితిన్ లై సినిమాలో అయితే అమెరికాను చుట్టేశారు. వేగాస్ నగరం క్యాసినోలు చికాగో లోని ట్రంప్ టవర్ నుండి.. ఎలీ అనే చిన్న టౌన్ అందాల వరకు.. అలాగే క్లయమ్యాక్స్ పార్టు తీసిన మొజావే ఎడారి వరకు.. అన్ని సుందరంగా కనిపిస్తున్నాయి. అందుకే అమెరికాలో ఉన్న ఎన్నారైలు కూడా ఈ ప్రాంతాల డిటైల్స్ కనుక్కొని అక్కడికి వెళదాం అనుకుంటున్నారట.
ఓ విధంగా చూస్తే ఈ మధ్యన వచ్చిన ఫిదా సినిమా బాన్సువాడ అందాలను చూపిస్తూ తెలంగాణ టూరిజంను ప్రమోట్ చేస్తే.. జయ జానకి నాయక మరియు నేనే రాజు నేనే మంత్రి సినిమాలు ఆంధ్ర ప్రదేశ్ టూరిజం ను ప్రమోట్ చేస్తున్నారు. అలాగే లై సినిమా అమెరికన్ టూరిజంను ఎంకరేజ్ చేసినట్లుంది. ఏమంటారు?