Begin typing your search above and press return to search.
నానిపై ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ ప్రశంసలు
By: Tupaki Desk | 27 Jun 2021 7:28 AM GMTనాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. సినిమా కమర్షియల్ గా ఆడకున్నా వందల కోట్ల విలువైన ప్రశంసలను దక్కించుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాని నటనతో పాటు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తీసుకున్న సున్నితమైన అంశం పై విమర్శకులు ఇంకా ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ వేదికలపై కూడా నాని జెర్సీ ప్రదర్శింపబడింది. ఈ సమయంలో నాని సినిమా గురించి ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ చోలే-అమండా బెయిలీ కామెంట్స్ చేశారు.
ఆమె ట్విట్టర్ లో జెర్సీ సినిమా గురించి స్పందిస్తూ... నేను జెర్సీ సినిమాను చూశాను. చాలా అద్బుతమైన ఎమోషనల్ జర్నీ. సినిమాను రూపొందించిన వారు అద్బుతంగా మలిచారు. వారి పనితనం బాగుంది. అర్జున్ కలలను చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. నాని మంచి నటన కనబర్చారు. మీరు ఆయనతో నవ్వుతారు.. ఆయనతో ఏడుస్తారు. ఇక నాకు ఇష్టమైన సన్నివేశం అంటూ ఎంతో మందికి ఇష్టం అయిన రైల్వే స్టేషన్ సీన్ అంది.
టీమ్ లో అవకాశం వచ్చిన సమయంలో అర్జున్ రైల్వే స్టేషన్ కు వెళ్లి ఒంటరిగా ఉన్న సమయంలో రైలు రావడం చూసి గట్టిగా అరుస్తాడు. ఆ సన్నివేశం చాలా బాగుంటుంది. చోలే-అమండా బెయిలీ కు కూడా అదే సన్నివేశం నచ్చిందని పేర్కొన్నారు. నాని కెరీర్ లో ఇప్పటికి ఎప్పటికి ది బెస్ట్ సినిమా అంటే జెర్సీ అనడంలో ఖచ్చితంగా సందేహం లేదు. ప్రస్తుతం జెర్సీ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. త్వరలోనే అది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.