Begin typing your search above and press return to search.
ఇండియాలోనూ కరెక్ట్ కలెక్షన్స్ తేలనున్నాయ్
By: Tupaki Desk | 9 Feb 2017 7:58 AM GMTప్రపంచంలోని సినిమా పరిశ్రమల్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ప్రముఖ స్థానమే ఉంటుంది. అనేక భాషల్లో సినిమాలు రూపొందడం.. అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఉండడం ఇందుకు కారణాలుగా చెప్పచ్చు. మన దేశ సినీ పరిశ్రమ విలువ 2 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 13.5 వేల కోట్ల రూపాయలుగా అంచనా.
కానీ మన దేశంలో సినిమా కలెక్షన్స్ ఫిగర్స్ విషయంలో సరైన లెక్కలు తేలే పరిస్థితులు ఇప్పటివరకూ లేవు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు కూడా తేలనున్నాయి. అమెరికాలో రెన్ ట్రాక్ కలెక్షన్స్ ఫిగర్స్ ను పక్కాగా ఇవ్వడంలో సరైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పుడు కామ్ స్కోర్ గా మారిన ఈ కంపెనీ.. ఇండియాలో కూడా ఎంటర్ అవుతోంది. ఇప్పటికే పీవీఆర్ తో ఈ సంస్థ ఒప్పందాలు చేసుకుంది. పీవీఆర్ కు 48 సిటీల్లో 562 స్క్రీన్లు ఉండగా.. అన్నిటి కలెక్షన్స్ రియల్ టైంలో వెల్లడి కానున్నాయి.
త్వరలో ఇతర మల్టీప్లెక్సులు కూడా ఇదే రూట్ లోకి మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం కరెక్ట్ కలెక్షన్స్ ఫిగర్స్ విషయంలో ఒక అడుగుగా చెప్పచ్చు. అయితే.. మన దేశంలో మల్టీప్లెక్స్ స్క్రీన్ కౌంట్ కంటే ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి. వీటికి కూడా టికెట్ అమ్మకాల్లో డిజిటలైజేషన్ తప్పనిసరి అంటూ ప్రభుత్వం నుంచి జీఓ లాంటివి వస్తే మాత్రం.. ఇండియన్ మూవీ కలెక్షన్స్ పూర్తి స్థాయిలో సరైన ఫిగర్స్ తేలనున్నాయి. ఇప్పుడు మన దేశం మొత్తం మీద 9వేల స్క్రీన్స్ ఉండగా.. వీటిలో 7,500 సింగిల్ స్క్రీన్స్ అనే విషయం గుర్తుంచుకోవాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/